విద్యారంగంలో పెను సంస్కరణలు తీసుకొస్తున్న దిల్లీ సర్కారు మరో ముందడుగు వేసింది. దేశంలోనే తొలి వర్చువల్‌ పాఠశాల ప్రారంభించింది. దేశంలో విద్యార్థలందరూ ఈ బడిలో చేరేందుకు అర్హులేకావడం విశేషం. దిల్లీ మోడల్‌ వర్చువల్ స్కూల్‌ దరఖాస్తుల ప్రక్రియను
చేపట్టింది.  9 నుంచి 12వ తరగతి వరకూ ఈ వర్చువల్ పాఠశాలలో పాఠాలు చెబుతారు. 13 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులు వర్చువల్‌ బడిలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.


అంతే కాదు..  నీట్‌, సీయూఈటీ, జేఈఈ వంటి పరీక్షలకు కూడా ఈ వర్చువల్‌ పాఠశాలలో నిపుణులతో శిక్షణ ఇస్తారు. దేశంలో అనేక కారణాలతో చాలా మంది పిల్లలు బడికి వెళ్లలేకపోతున్నారు. బాలికలను దూరం పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడంలేదు. అలాంటి వారందరికీ ఈ వర్చువల్ స్కూల్ ఓ వరం అనే చెప్పాలి. ఈ స్కూల్ తరగతులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. ఉపాధ్యాయులు బోధించే వీడియోలను ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ చేస్తారు. ఈ వర్చువల్ స్కూల్‌ దిల్లీ బోర్డు ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా పనిచేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: