2016లో మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఆరేళ్ల తర్వాత సుప్రీం కోర్టు విచారించబోతోంది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వీటిని విచారించనుంది. 2016 నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థలో నల్లధనం తగ్గించడానికి, పారదర్శకతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆనాడు కేంద్రం తెలిపింది.


అది జరిగిన కొన్నాళ్లకు 2వేల రూపాయల నోటును కేంద్రం తీసుకొచ్చింది. మోదీ నిర్ణయాన్ని కాంగ్రెస్  సహా పలు రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అప్పుడే నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్  చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 2016 డిసెంబరు 16నే సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేసింది. అయితే ఇప్పటివరకూ వాటిపై విచారణ చేపట్టలేదు. ఇప్పుడు విచారణ చేయబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: