నయనతార , విఘ్నేశ్‌ శివన్‌ దంపతుల నుంచి అభిమానులకు సూపర్ గుడ్‌న్యూస్‌. తాము తల్లిదండ్రులైనట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.తమ పిల్లలను ఆశీర్వదించాలని కోరారు. ఈ దంపతులకు ట్విన్‌ బాయ్స్‌ (కవల అబ్బాయిలు) జన్మించారు. అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు నయన్‌, విఘ్నేశ్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.నయన్ విఘ్నేశ్ లవ్ స్టోరీ, పెళ్లి రూమర్ల మీద లెక్కలేనన్ని రూమర్లు రాగా..ఎట్టకేలకు వాళ్లిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. జూన్‌ 9న వీరిద్దరి పెళ్లి మహాబలిపురంలో గ్రాండ్‌గా జరిగింది. తాజాగా నయన్ దంపతులు పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు.నయన్- విగ్నేష్ వివాహానికి కోలీవుడ్ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి కొంత మంది సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. 


ఇదిలా ఉంటే ఇంతలోనే నయన్ తల్లి కావడం షాకింగ్ గా మారింది.ఇద్దరూ కూడా మగ పిల్లలని చెప్పిన విగ్నేష్ శివన్.. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలతో మాకు ఇద్దరు పిల్లలు జన్మించారు. మా కోసం మీ అందరి ఆశీస్సులు కూడా కోరుకుంటున్నా అని తెలుపుతూ ట్వీట్ పెట్టారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న నయన్- విగ్నేష్ దంపతులు ఇంతలోనే పేరెంట్స్ కావడాన్ని బట్టి చూస్తే.. పెళ్ళికి ముందే నయన్ గర్భం ధరించిందని చెప్పుకోవచ్చు. ఇలా నయన్ దంపతుల ప్రేమ సంగతులు, డేటింగ్ వ్యవహారం అనేది పలు చర్చలకు తావిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: