తెలంగాణలో గ్రూప్-4 ప్రకటన జారీకి 33 జిల్లాలు 74 విభాగాల మధ్య సమన్వయం అవసరం అవుతుంది. జిల్లా స్థాయి పోస్టులు కావడం వల్ల సమగ్ర ప్రతిపాదనలు తెప్పించుకుని పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకు సమయం పడుతుంది. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా కమిషన్ వెంటనే ప్రకటన జారీ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. అనంతరం 23 రోజుల వ్యవధిలో ప్రతిపాదనలు తెప్పించుకుని సమగ్ర ప్రకటన జారీ చేసి దరఖాస్తులు స్వీకరించాలని మొదట టీఎస్‌పీఎస్సీ భావించింది. కానీ ఈ వివరాలు అందించడంలో కొన్ని ప్రభుత్య విభాగాధిపతులు జాప్యం చేశారు.

అంతేకాదు..  పోస్టుల హోదాలో మార్పులు ఇతర కారణాల వల్ల గురువారం రాత్రి వరకు ఈ వివరాలు అందించలేదు. అంతే కాదు.. ఈ ప్రతిపాదనలకు మరో వారం సమయం పట్టనున్నట్లు సమాచారం. అందుకే ఇంత ఆలస్యం జరిగింది. అయితే.. వీలైనంత త్వరగా పంపిస్తామని సంబంధిత విభాగాలు హామీ ఇవ్వడంతో వారం తరువాత ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: