జనవరి 26వ తేది నుంచి దేశ వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయి లో 18వ తేదీన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో సన్నాహక సమావేశం జరిగింది. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లా స్థాయి లో సన్నాహక సమావేశాలు కూడా జరిగాయి. ఈ అంశానికి సంబంధించి 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు బ్లాక్ లెవల్ సమావేశాలు నిర్వహించి హాత్ సే హాత్ జోడో అభియాన్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.


ఈ సభలు నిర్వహించి హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. జనవరి 3,4 తేదీలలో హైదరాబాద్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో మరియు ధరణి అంశాలపై శిక్షణ శిబిరాలు నిర్వహించబోతున్నారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గారు హైదరాబాద్ ఉంటున్నందున ఆమెకు పార్టీ ఉన్నతస్థాయి బృందం వెళ్లి ఒక వినతిపత్రం ఇవ్వాలని భావిస్తోంది. 28వ తేదీన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: