తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో కోలుకోలేని షాక్ తగిలింది. ప్రముఖ నటుడు నందమూరి హీరో తారకరత్న మృత్యువుతో పోరాడి చనిపోయారు. ఆయన ఇటీవల గుండెపోటు కారణంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. గత నెల 27 వ తేదీన టీడీపీ లీడర్ నారా లోకేష్ మొదలు పెట్టిన పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తారకరత్న..ఆ పాదయాత్రలో నడుస్తూ నడుస్తూ సడన్ గా కుప్పకూలిపోవడం జరిగింది.ఇక అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు వెంటనే తారకరత్నని కుప్పం హాస్పిటల్ కి తరలించారు. ఆ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన తరువాత తారకరత్నని బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.


బ్రెయిన్ సరిగ్గా స్పందించకపోవడంతో అప్పటి నుంచి ఆయన కోమాలోనే ఉన్నారు. 22 రోజులుగా చికిత్స అందిస్తూ, డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన ఆరోగ్యంలో మాత్రం పురోగతి కనిపించలేదు. గత వారం రోజులు నుంచి తారకరత్నకు విదేశీ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ వస్తున్నారు. అయితే నేడు ఎంఆర్ఐ స్కాన్‌ నిర్వహించగా తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం తెలిసింది. ఇంతలో ఆయన చనిపోయిన విషయం తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: