ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తుంది. వీటిల్లో ముఖ్యంగా ఆడపిల్లల కోసం చాలా ప్రత్యేకమైన పథకాలు కూడా ఉన్నాయి. వీటిల్లో బాలిక సమృద్ధి యోజన కూడా ఒక ముఖ్యమైన పథకం. ఈ పథకం ముఖ్యంగా చిన్నారుల కోసం అందుబాటులోకి తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో చేరడం వల్ల ఆడపిల్లలకు చాలా ఉపయోగాలు కలుగుతాయి అంటే నమ్మండి.


ఇక  బాలిక యోజన పథకం 1997 నుంచి అమలులోకి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా పాఠశాలలో ఆడ పిల్లల సంఖ్యను పెంచడానికి ఈ స్కీమ్‌ను అమలు చేయడం జరిగింది. ఈ పథకం కింద ఆడ పిల్ల పుట్టిన తర్వాత అమ్మకు రూ.500 బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆడ పిల్ల పాఠశాలకు వెళ్లిన దగ్గరి నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ కూడా అందించడం జరుగుతుంది.


ఇక ఆడ పిల్లకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం డబ్బులను విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక గ్రామాల్లో అంగన్‌వాడీ వర్కర్ల దగ్గరకు వెళ్లి ఈ స్కీమ్‌ అప్లికేషన్ ఫిల్ చేసి పథకం ద్వారా వచ్చే లాభాలు సులువుగా పొందవచ్చు. ఇక పట్టణాల్లో మాత్రం హెల్త్ ఫంక్షనరీస్ వద్ద స్కీమ్ అప్లికేషన్స్  లభించడం జరుగుతుంది.


ఇక ఆడ పిల్ల ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు సంవత్సరానికి రూ.300 ఇస్తారు. తర్వాత 4వ తరగతి నుంచి రూ.500 వరుకు రావడం జరుగుతుంది. 5వ తరగతికి రూ.600, 6 నుంచి 7వ తరగతికి రూ.700, 8వ తరగతికి రూ.800, 9వ తరగతిలో రూ.1000  స్కాలర్‌షిప్ ద్వారా అందచేయడం జరుగుతుంది. ఇకపోతే ఆడపిల్లల కోసం ఈ స్కీమ్ మాత్రమే కాకుండా మరో పథకం కూడా అందుబాటులో ఉంది. అదే  సుకన్య పథకం.



మరింత సమాచారం తెలుసుకోండి: