నేడు మరోసారి దేశీయ మార్కెట్ పరుగులు పెట్టింది. ఈరోజు మొదటగా నష్టాల్లో మొదలైన స్టాక్ మార్కెట్ చివరకు ముగిసేసరికి భారీ లాభాలతో ముగిసింది. జనవరి - మార్చి త్రైమాసికంలో జిడిపి గణాంకాల విడుదలకు ముందు మార్కెట్ పైకి కదలడం నిజంగా గమనించాల్సిన విషయం. దీనితో మధ్యాహ్నం నుంచి మార్కెట్ లాభాల బాటపట్టింది. ఇక నేడు ఇంట్రాడేలో సెన్సెక్స్ 377 పాయింట్లు వరకు నష్టపోగా, 31823 పాయింట్లు కనిష్టానికి చేరుకుంది. అలాగే నిఫ్టీ కూడా 9376 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ గూడ్స్ షేర్లలో కొనుగోళ్లు కారణంగా ఇండెక్స్ లాభాల్లోకి నడిచాయి. రోజు ముగిసే సరికి bse సెన్సెక్స్ 224 పాయింట్లు లాభంతో 32424 పాయింట్ల వద్ద NSE నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో 9569 పాయింట్ల వద్ద ముగిసింది.

 


ఇక ఈరోజు మార్కెట్ విశేషాల్లోకి వస్తే... ioc, విప్రో, ongc, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, కోల్ ఇండియా ఇలా అనేక షేర్ లు లాభపడ్డాయి. ఇందులో ఐఓసి ఏకంగా ఏడు శాతం లాభపడింది. అదే సమయంలో యాక్సిస్ బ్యాంక్, అదానీ స్పోర్ట్స్, tcs, టైటాన్, భారతీ ఎయిర్టెల్ నష్టాల బాట పడ్డాయి. అందులో యాక్సిస్ బ్యాంక్ రెండు శాతం పైగా నష్టపోయింది.

 


ఇక నిఫ్టీ కోర్ ఇండెక్స్లు కాస్త మిశ్రమంగా ముగిశాయి. కేవలం నిఫ్టీ IT, నిఫ్టీ మీడియా మినహా మీద ఇండెక్స్లు అన్ని కూడా లాభాల బాట పడ్డాయి. ఇక అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ లాభాల్లో ట్రేడ్ అయింది. 14 పైసలు లాభంతో ప్రస్తుతం 75.62 వద్ద కొనసాగుతోంది. ఇక చివరగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల విషయానికి వస్తే ఈ రోజు కాస్త తగ్గాయి. ఇందులో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 2.9% తగ్గి 34.98 డాలర్లకు చేరుకుంది. ఇక అలాగే WTA బ్యారెల్ కు 3.35 శాతం తగ్గి 32.58 డాలర్లకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: