కరోనా వేరస్ నేపథ్యంలో అనేక మంది కూడా ఉద్యోగాలు కోల్పోయారు.దీంతో అలాంటి వారంతా కూడా సొంతంగా బిజినెస్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి ఫ్లై యాష్ బ్రిక్స్(Fly Ash Bricks) బిజినెస్ చాలా మంచి ఎంపిక అని చెప్పవచ్చు. వారికి సొంత భూమి ఉండి, తక్కువ పెట్టుబడితో మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు ఈ ఫ్లై యాష్ బ్రిక్స్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇక ఇందుకోసం 100 గజాల స్థలం, కనీసం 2 లక్షల రూపాయలు పెట్టుబడి అనేది పెట్టాల్సి ఉంటుంది. దీనితో మీరు ప్రతి నెలా కూడా 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. వేగవంతమైన పట్టణీకరణ యుగంలో బిల్డర్లు ఫ్లై యాష్‌తో చేసిన ఇటుకలను మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ అనేది ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ బిజినెస్ చాలా మంచి ఎంపికగా చెప్పవచ్చు.ప్రతి నెలా కూడా 3 వేల ఇటుకలు తయారు చేసుకోవచ్చు..ఈ ఇటుకలను విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే బూడిద, సిమెంట్ ఇంకా అలాగే రాతి ధూళి మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ వ్యాపారం కోసం, మీరు ఎక్కువ పెట్టుబడిని ఈ యంత్రాలపై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇందుకు వినియోగించే మాన్యువల్ యంత్రాన్ని సుమారు 100 గజాల స్థలంలో ఉంచొచ్చు. ఈ యంత్రం ధర వచ్చేసి రూ.1.50 లక్షలు ఉంటుంది.


ఇక ఈ యంత్రం ద్వారా, మీరు ఇటుక ఉత్పత్తి కోసం 5 నుండి 6 మంది వ్యక్తులు మీకు అవసరం.దీంతో మీరు రోజుకు దాదాపు 3 వేల ఇటుకలను ఉత్పత్తి చేయవచ్చు. ఒక్కో ఇటుక ధర రూ. 5 నుంచి రూ. 10 వరకు  కూడా ఉంటుంది.అందుకే ఈ వ్యాపారంలో ఆటోమేటిక్ మెషీన్ల ఉపయోగిస్తే ఎక్కువ ఉత్పత్తితో పాటు ఇంకా ఆదాయాన్ని పొందొచ్చు. అయితే ఈ ఆటోమేటిక్ మిషన్ ధర వచ్చేసి రూ.10 నుంచి 12 లక్షల వరకు కూడా ఉంటుంది. ముడిసరుకు కలపడం నుంచి ఇటుకల తయారీ వరకు ఈ యంత్రం ద్వారానే జరుగుతాయి. ఈ ఆటోమేటిక్ మెషీన్ ద్వారా గంటలో వెయ్యి ఇటుకలను మీరు తయారు చేయవచ్చు. అంటే ఈ యంత్రం సహాయంతో మీరు నెలలో మూడు నుండి నాలుగు లక్షల ఇటుకలను ఈజీగా తయారు చేయవచ్చు.ఇక బ్యాంకు నుంచి రుణం తీసుకుని కూడా మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందు కోసం ముందుగా బ్యాంకులను సంప్రదించి మీరు రుణాలను పొందొచ్చు. ఎస్సీ ఇంకా బీసీ కార్పొరేషన్ల నుంచి కూడా రుణాలను తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: