చాలా మంది కూడా మంగు మచ్చలతో బాధపడుతూ ఉంటారు. స్త్రీ, పురుషుల బేధం లేకుండా ఈ సమస్య చాలా మందికి కూడా వస్తూ ఉంటుంది. ఈ మంగు మచ్చల వల్ల ఎటువంటి నష్టం లేనప్పటికి వీటి వల్ల ముఖం చూడడానికి అందవిహీనంగా కనిపిస్తుంది.ఈ నలుపు వర్ణం ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల చర్మంపై మంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా మంగు మచ్చల సమస్యతో బాధపడే వారు మందులను వాడడానికి బదులుగా సహజంగా లభించే చింత గింజలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.చింతగింజలను వాడడం వల్ల చర్మ కణాలలో వచ్చిన ఇన్ ప్లామేషన్ తగ్గి ఆ భాగంలో మచ్చలు తగ్గుతాయి. అలాగే చింతగింజల పొడిలో తేనె కలిపి లోపలికి తీసుకోవడం వల్ల కూడా మంగు మచ్చలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా చింతగింజలను బాహ్యంగా, లోపలికి వాడడం వల్ల మంగు మచ్చలు నెమ్మదిగా తగ్గి ఆ భాగంలో చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.


ఇలా చింతగింజలను వాడడంతో పాటు మంగు మచ్చల సమస్యతో బాధపడే వారు ఎండలో తిరగకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఎండలోకి వెళ్లినా ముఖంపై ఎండ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే నీటిని ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు.చింతగింజలను తొక్కు పచ్చళ్లు, చిరుతిళ్లు తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. కొందరు వీటిని ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటారు. కానీ చింతగింజల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని వాడడం వల్ల మంగు మచ్చలు పోతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. చింతగింజలను పేస్ట్ లాగా లేదా పొడిగా చేసుకుని దానికి తేనెను కలిపి మంగు మచ్చలపై రాయాలి. ఇలా రాయడం వల్ల మెలనోసైట్స్ లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే థైరోసోనైస్ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో మెలనిన్ ఉత్పత్తి తగ్గి మంగు మచ్చలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: