ఏపిలో కరోనా పై యుద్దం చేసున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్ర పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు చెబుతున్నారు.  తాజాగా నెల్లూరు జిల్లాలో నిత్యావసరాల పంపిణీ వివాదంలో నోటీసులు జారీ చేయడం పట్ల కోవూరు శాసనసభ్యుడు, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంతే కాదు మీకు చేతనైతే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. 

 

పేదలకు నిత్యావసరాలు అందిస్తే నాపైనా, ఆ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులపైనా కేసులు నమోదు చేస్తారా? అంటూ  జిల్లా కలెక్టర్, ఎస్పీ తీరును ప్రశ్నిస్తూ మండిపడ్డారు. నిత్యావసరాల పంపిణీలో పాల్గొన్న ఒక్క అధికారిని సస్పెండ్ చేసినా సహించబోనని హెచ్చరించారు. పోలీసులు, వలంటీర్లు, రెవెన్యూ సిబ్బంది ప్రాణాలను కూడా లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తుంటే మీరు ఏసీ రూముల్లో కూర్చుంటున్నారు అంటూ విమర్శించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: