దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత చాలా అధికంగా ఉంది. అందులో ప్రధానంగా హైదరాబాద్ లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఇక లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వాలి అని కేసీఆర్ సర్కార్ భావించినా సరే ప్రస్తుతం మాత్రం భయపడుతుంది. 

 

ఈ నేపధ్యంలో కేంద్రం మరో రెండు రోజుల్లో 5 వ విడత లాక్ డౌన్ పై ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనితో లాక్ డౌన్ ని పెంచవద్దు అని కోరుతున్నారు హైదరాబాద్ వాసులు. దీనిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గురువారం 13 నగరాల్లో పరిస్థితిపై కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా సమీక్షించారు. హైదరాబాద్ తో పాటు 13నగరాల మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లతో కేబినెట్‌ కార్యదర్శి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: