దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,75,326 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 45,209 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 90,95,807కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 85,21,617 మంది కోలుకున్నారు. మిగిలిన 4,40,962 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

శనివారం నాటికి దేశవ్యాప్తంగా 13,17,33,134 నమూనాల్సి పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 501 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,33,227కు చేరింది. ప్రస్తుతం మరణాల రేటు 1.46 శాతంగా ఉంది. రికవరీ రేటు 93,69 శాతానికి పెరిగిందన్నారు. ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉందని.. ఏకంగా 17.74 లక్షల కేసులు నమోదయ్యాయన్నారు. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 5,760 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయని ఐసీఎంఆర్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: