తెలంగాణ బీజేపీ నేతలు అప్పుడే ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అంటున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2023లో కూలడం ఖాయమని.. బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్‌ అంటున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటున్నారట. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన పార్టీ పదాధికారులు జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతల సమావేశంలో తరుణ్‌ ఛుగ్‌ ఈ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నారట.


దేశం ఫస్ట్‌, పార్టీ నెక్ట్స్, ఫ్యామిలీ లాస్ట్‌ అనేదే బీజేపీ నినాదమట. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌కు వ్యతిరేకమైన వాతావరణ నెలకొందట. కేసీఆర్‌ పాలనపై ప్రజలు కోపంతో ఊగిపోతున్నారట. ఈ విషయాన్ని కార్యకర్తలు ఇంటింటికీ తీసుకువెళ్లాలని తరుణ్ చుగ్‌ అంటున్నారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సుపరిపాలనపై ఈ నెల 30నుంచి జూన్ 14వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపడతారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

BJP