ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా వైర‌స్ విస్త‌రించ‌డంతో అన్ని దేశాల్లో లాక్ డౌన్ లు విధించారు. అందు లో భాగంగా మ‌న దేశంలో కూడా లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ కార‌ణంగా దేశ వ్యాప్తం అన్ని కార్య‌క‌లాపాలు స్థంబించాయి. అలాగే దేశ వ్యాప్తంగా సినిమా షూటింగ్ లు కూడా ఆగి పోయాయి. అలాగే సినిమా థీయేట‌ర్ల ను కూడా చాలా రోజుల పాటు మూసివేశారు. అయితే లాక్ డౌన్ వ‌చ్చే నాటికే చాలా సినిమా లు త‌మ షూటింగ్ ల‌ను పూర్తి చేసుకున్నాయి.


కానీ థీయేట‌ర్లు అందు బాటు లో లేక పోవ‌డం తో ఓటీటీ ల వైపు నిర్మాత ల చూపు ప‌డింది. వ‌రుస పెట్టి సినిమాలు, వెబ్ సిరిస్ లు ఓటీటీల‌లో విడుద‌ల చేశారు. దీంతో ఓటీటీ ల‌కు డిమాండ్ పెరిగి పోయింది. ప్రేక్ష‌కులు కూడా ఓటీటీ ల‌లో సినిమాలు, వెబ్ సిరిస్ లు చూడ‌టం మొద‌లు పెట్టారు. దీంతో ప‌లు ఓటీటీల‌కు చందాదారులు విప‌రీతంగా పెరిగి పోయారు. అందులో ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ ఒక‌టి . లాక్ డౌన్ నుంచి అమెజాన్ ప్రైమ్ కు స‌బ్ స్క్రిప్ష‌న్ లు పెరిగి పోయాయి. అయితే మొద‌ట దీని స‌బ్ స్క్రిప్ష‌న్ ధ‌ర‌లు త‌క్కువ గా ఉండేవి. కానీ కొన్ని రోజుల్లో ఈ ధ‌ర‌లు 50 శాతం మేర పెరుగ బోతున్నాయి.


కొత్త ధ‌రల ప్ర‌కారం సంవ‌త్స‌రానికి రూ. 999 నుంచి రూ. 1499 కి పెరుగుతున్నాయి. అలాగే మూడు నెల‌ల కు రూ.329 నుంచి రూ.459 కి పెరుగుత‌న్నాయి. అలాగే ఒక నెల‌కు రూ. 129 నుంచి రూ.179 వ‌ర‌కు పెరుగుత‌న్నాయి. దీని పై అమెజాన్ స్పందిస్తూ త‌మ చందాదారుల‌కు మ‌రింత సౌక‌ర్య వంతం గా సేవ‌లు అందించడానికి మ‌రన్ని హంగులు అద్ద‌తున్నామ‌ని తెలిపారు. దీని కోస‌మే ధ‌ర‌లు పెంచాల్సి వ‌స్తుందని తెలిపారు. అయితే ఈ కొత్త ధ‌రలు ఎప్ప‌టి నుంచి అమలు లోకి వ‌స్తాయి అనేది తెలియాల్సి ఉంది. అయితే  ప్ర‌స్తుతం అమెజాన్ లో గ్రేట్ ఇండియాన్ ఫెస్టివ‌ల్ సేల్ ఉంది. ఈ సేల్ త‌ర్వాత నుంచి ఈ ధ‌ర‌లు అమ‌లు లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: