ప్రస్తుతం బయట ఎండలు మండిపోతున్నాయి కాబట్టి చలవ చేసే ఆహారం తీసుకోవడం ఎంతైనా అవసరం. అందుకే ఈ ఆర్టికల్ లో శరీరంలో వేడి తగ్గించే రుచికరమైన సొరకాయ పెరుగు కూర ఎలా చేయాలో తెలుసుకుందాం.


సొరకాయ పెరుగు కర్రీకి కావలసిన పదార్థాలు:

1. రెండు కప్పుల పెరుగు,

2. కట్ చేసి ఉడకబెట్టిన సొరకాయ ముక్కలు,

3. రెండు కప్పుల పెరుగు కి ఒక కప్పు సొరకాయ ముక్కలు తీసుకోవాలి.

4. అరకప్పు కట్ చేసిన ఉల్లిగడ్డలు

5. కరివేపాకు,

6. అల్లం

7. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆవాలు, మినప్పప్పు, జిలకర, మెంతులు

8. చిటికెడు పసుపు, ఇంగువ.



తయారు చేసే విధానం:



మిక్సీ జార్ లో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక గిన్నె పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి.. ఆయిల్ వేడి అయిన తర్వాత పోపుదినుసులు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆపై ఎండుమిర్చి, పసుపు కూడా గిన్నెలో యాడ్ చేయాలి. అనంతరం కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయలు గిన్నెలో వేసి వేయించాలి. మరికొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు పెరుగులో ఉంచాలి.



అయితే ఆ గిన్నెలో వేయించిన మసాలా దినుసులు, ఉల్లిపాయలకు.. గ్రైండ్ చేసిన అల్లం పేస్టు యాడ్ చేయాలి. వీటిని కొద్ది సేపు వేయించాలి. అల్లం పేస్ట్ కూడా వేయించిన తర్వాత ఉడకబెట్టిన సొరకాయ ముక్కలు కలుపుకోవాలి. స్టవ్ మీద ఉన్నప్పుడు బాగా మిక్స్ చేసుకొని అనంతరం స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం రెండు కప్పుల పెరుగు కలుపుకొని బాగా కలిసేలా గంటెతో తిప్పాలి. ఆపై రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకుని మంచిగా కలుపుకుంటే రుచికరమైన సొరకాయ పెరుగు కర్రీ తయారు అవుతుంది.


పెరుగు, ఉల్లిపాయలు, సొరకాయ కలిపి తినడం వల్ల చలవ చేస్తుందని చెబుతుంటారు. ఈ వేసవి కాలంలో మీరు కూడా ఈ కొత్త రెసిపీని ట్రై చేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: