వర్షాలు బాగా దంచి కొడుతున్నాయి కదా. నోటికి కాస్త రుచిగా ఏదన్నా తినాలనిపిస్తుంది కదా. ఎప్పుడు వండే కూరలు కాకుండా ఈసారి సరి కొత్తగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి వండిపెట్టండి. ఈరోజు ఇండియా హెరాల్డ్ వారు బీన్స్ అండ్ క్యాలీఫ్లవర్ కూర ఎలా చేయాలో మీకు వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా కర్రీ ఎలా వండాలో చూద్దామా. !

కావలిసిన పదార్ధాలు :

కాలీ ఫ్లవర్ - 1
ఉల్లిపాయ 1
గ్రీన్ బీన్స్ - 200 గ్రా (సన్నగ తరిగిన)
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర -1 టేబుల్ స్పూన్
సాయి మినపప్పు -1 టేబుల్ స్పూన్
పచ్చి శెనగపప్పు -1టేబుల్ స్పూన్
ధనియాల పొడి -కొద్దిగా
కరివేపాకు - కొద్దిగా
కారం - 1 టేబుల్ స్పూన్
పసుపు పొడి - 1/2 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి
మంచి నూనె - 2 టేబుల్ స్పూన్
కొత్తిమీర -కొద్దిగా

తయారుచేయు విధానం:

ముందుగా కాలిఫ్లవర్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉప్పునీటిలో కొంచెం సేపు ఉంచండి ఇలా చేయడం వలన  పువ్వులో ఏమన్నా  పురుగులు ఉంటే నీటిలో తేలుతాయి.కొంచెం సేపు అయ్యాక నీళ్ళల్లో నుంచి తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పెట్టుకొండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో కాలీఫ్లవర్,  బీన్స్ ముక్కలను వేసి కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించి తరువాత మిగిలిన నీటిని  వంపేయాలి. తరువాత మళ్ళీ  స్టౌ మీద ఒక బాండీ పెట్టి నూనె వేడి అయ్యాక అందులో  ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చి శెనగపప్పు, కరివేపాకు వేసి తాలింపు పెట్టండి. తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపండి. తరువాత ముందుగా ఉడక బెట్టుకున్న క్యాలీఫ్లవర్, బీన్స్ ముక్కలు వేయండి. తరువాత పసుపు, కారం,ఉప్పు,  ధనియాల పొడి వేసి మూత పెట్టి నూనె పైకి తేలేదాక ఉంచండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: