ఇటీవలి కాలంలో ప్రభుత్వ అధికారులు లంచానికి  మంచం వేస్తున్నారు అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు తెరమీదకు వస్తున్నాయి  ఏదైనా పని నిమిత్తం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు  వెళితే ఇక లంచం ఇచ్చేంతవరకు పని జరగదు అంటూ ముఖం మీద చెప్పేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అంతేకాదు ఎంతోమందినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే లంచం తీసుకుంటూ ఈ మధ్యకాలంలో దొరికిపోయిన ప్రభుత్వ అధికారుల సంఖ్య కూడా ఎక్కువైపోతుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి అనే పథకాన్ని అందిస్తోంది. కళ్యాణ  లక్ష్మీ ఆమోదించేందుకు విఆర్వో లంచం డిమాండ్ చేయగా ఇక చివరికి ఆ నిరుపేద కుటుంబం ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. దీంతో వీఆర్వో గుట్టురట్టయింది. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. మేడపల్లి విఆర్వో ఐలయ్యను ఇటీవలే అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. మేడి పల్లి గ్రామానికి చెందిన ఏకాంబరం కుమార్తె మౌనిక వివాహం జనవరి 6వ తేదీన జరిగింది. ఇక ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మీ  సేవలో దరఖాస్తు చేసుకున్న పత్రాలను విఆర్ఓ ఐలయ్య కు అందించారు.


 నివేదికను పూర్తిచేసేందుకు ఐలయ్య ఏకంగా పది వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. అయితే అంత ఇచ్చుకోలేము అంటూ ఆ నిరుపేద కుటుంబం చెప్పడంతో కనీసం 5,000 అయినా చెల్లించాలి అంటూ బేరసారాలకు దిగాడు. అయితే తమ వద్ద డబ్బు లేదని కల్యాణలక్ష్మి వచ్చిన తర్వాత ఇస్తాము అంటూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కల్యాణలక్ష్మి వచ్చిన తర్వాత డబ్బులు లేవని ఏకాంబరం చెప్పడంతో కనీసం మూడు వేలు అయిన ఇవ్వాలి అంటూ వేధింపులకు గురిచేశాడు విఆర్వో. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఏకాంబరం. ఈ క్రమంలోనే ఏకాంబరం విఆర్వో ఐలయ్య కు మూడు వేలు ఇస్తున్న సందర్భంలో ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక అనంతరం మాట్లాడిన డీఎస్పీ మధుసూదన్ ఎవరైనా లంచం అడిగితే 9440446146 ఈ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: