
పక్కనే ఉన్న స్నేహితులతో మాట్లాడే దానికంటే సోషల్ మీడియాలో ఎక్కడో ఎవరో ముక్కూ ముఖం తెలియని వారితో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అమ్మాయి పేరు కనిపించింది అంటే చాలు వెనక ముందూ ఆలోచించకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెట్టేస్తూ ఉన్నారు. ఇక్కడ ఓ యువకుడు ఇలాగే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. డేటింగ్ యాప్ ద్వారా ఈ రిక్వెస్ట్ పెట్టడం గమనార్హం కానీ చివరికి ఆ యువకుడికి మాత్రం ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.
ముంబాయిలో ఇలా ఓ మహిళా యువకుడికి ఊహించని షాక్ ఇచ్చింది. అందేరి ఎంబీఏ చదువుతున్న ఓ యువకుడు హింద్ అనే డేటింగ్ యాప్ లో ఓ మహిళ తో చాటింగ్ చేశాడు. వీడియో కాల్ లో భాగంగా సదరు మహిళను నగ్నంగా కనిపించింది. ఇక అతడిని కూడా నగ్నంగా చాట్ చేయాలి అంటూ కోరింది. ఇక అమ్మాయి కోరిన తర్వాత ఊరుకుంటాడా నగ్నంగా కాల్ చేసాడు. ఇక ఆ తర్వాత ఎంతో సంతోష పడిపోతున్నా సమయంలో ఆ రోజు రాత్రి ఆ వ్యక్తి వాట్సాప్ కి ఆమెతోపాటు యువకుడు నగ్నంగా చాట్ చేసిన వీడియో వచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్. 10,000 గూగుల్ పే చేయకపోతే ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో భయపడిపోయిన యువకుడు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు..