అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టాడూ అనే ఒక సామెత ఉంది. కొన్ని సంఘటనల విషయంలో ఈ సామెత సరిగ్గా సరిపోతుంది అనే విషయం తెలిసిందే. ఇక్కడ జరిగిన ఘటన తెలిస్తే మాత్రం ఈ సామెత ఈ ఘటన గురించే పుట్టుకొచ్చిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఏం జరిగిందంటే తన తండ్రికి ధైర్యంగా ఉంటాడని  కొడుకు ఒక అటెండర్ నియమించాడు.ఈ క్రమంలోనే సదరు వ్యక్తికి సేవలు చేస్తూ ఎంతో నమ్మకంగా ఉండాల్సిన అతను చివరికి 40 లక్షల దొంగలించేందుకు ప్రయత్నించాడు.  కానీ చివరికి పోలీసులు రంగంలోకి దిగడంతో కటకటాలపాలయ్యాడు అని చెప్పాలీ. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లో అర్ని అనే 94 ఏళ్ల వ్యక్తి నివాసముంటున్నాడు. ఆయన కుమారుడు విద్యుత్ అర్ని కుటుంబంతో కలిసి అమెరికాలో ఉండగా.. కూతురు హాంకాంగ్లో ఉంటుంది. ఇక తల్లి చనిపోవడంతో తండ్రికి సహాయంగా ఎవరూ లేరు అని భావించి సమీపంలో చైల్పూరు గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్  ను 30 వేల జీవితానికి అటెండర్గా నియమించాడు కొడుకు. ఇక  ఉదయ్ కిరణ్ తో పాటు డ్రైవర్ కుక్ పనిమనిషి సహా నలుగురు పరిగెత్తారు. ఈ క్రమంలోనే ఇక ఇంట్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా గమనించేందుకు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.


 ఈ క్రమంలోనే తన తండ్రి ఫోన్ కంప్యూటర్ ఐప్యాడ్ తదితర పనులను కూడా ఉదయ్ కిరణ్  దగ్గరుండి చూసుకునేవారు. నమ్మకస్తుడిగా పనిచేసేవాడు. ఇదే అదునుగా భావించి లావాదేవీలు రహస్యంగా  ప్రతి నెల ఖర్చు డబ్బులు డ్రా చేసే నిమిత్తం 40 లక్షల వరకు దొడ్డిదారిలో డ్రా చేసి జేబులో వేసుకున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే అనుమానం వచ్చిన కొడుకు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: