నేటి రోజుల్లో ఎందుకో మనుషులు పిరికి వాళ్లలా మారి పోతున్నారా అంటే వెలుగు  లోకి వస్తున్న ఘటనలు మాత్రం ఇది నిజమే అని చెప్పకనే చెబుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఎంతో ధైర్యం గా నిలబడి ఎదుర్కొనే వారు మనుషులు. ఎంతటి సమస్యకైనా సరే కుంగిపోయే వారు కాదు. కానీ నేటి రోజుల్లో మాత్రం చిన్న చిన్న సమస్యలకు భయపడి పోతున్నారు. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నారు. చివరికి ఆ చిన్న సమస్య కి జీవితం అక్కడితో  ముగిసి పోయింది అని భావిస్తూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి.

 ఇలా ఇటీవల కాలం లో క్షణికావేశం లో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణానికి పాల్పడి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరం గా ముగిస్తున్నా వారు  ఎంతోమంది. కొన్ని కొన్ని ఘటనల్లో అయితే ఒక్కరు కాదు ఏకంగా కుటుంబం మొత్తం ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. అప్పుల బాధ తాళలేక పోయిన కుటుంబం చివరికి ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అని భావించింది.



 చివరికి కుటుంబం మొత్తం చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకున్న  విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు లోకి వచ్చింది. ఆదిభట్ల పరిధి కుర్మాలగూడ ప్రాంతం లో ఒక కుటుంబం నివసిస్తోంది. ఈ క్రమం లోనే ఇటీవల కాలం లో అప్పుల బాధలు ఎక్కువ అయ్యాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించ లేదు. ఒక వైపు నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో చివరికి కుటుంబం మొత్తం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో ఘటన జరిగగా.. తెల్లారేసరికి తండ్రి ఇద్దరు కూతుళ్లు మృతదేహాలు నీటిపై తేలాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: