కరోనా వైరస్ కాలం  లో వైద్యులు ప్రత్యక్ష దైవాలుగా మారి పోయారు. కాని కొంత మంది వైద్యులు మాత్రం నిర్లక్ష్యం గా వ్యవహరించడం కారణం గా ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి అని చెప్పాలి. వెరసి రోజు రోజుకు వెలుగు లోకి వస్తున్న ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపు తున్నాయి అని అర్థమవుతుంది. సాధారణం గా పుట్టిన శిశువుకు ఎదుగుతున్న కొద్దీ నెలల వారిగా ఇంజక్షన్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు.. ఇంజక్షన్ వల్ల పిల్లల్లో ఎదుగుదల ఎలాంటి సమస్యలు రాకుండా వుంటుందని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ ఇలాంటి ఇంజక్షన్లు కొన్ని సార్లు ఏకంగా పిల్లల ప్రాణాల మీదికి తేవడం జరుగుతూ ఉంటుంది.


 ఇక్కడ ఇలాంటి తరహా విషాద కర ఘటన జరిగింది. భీంగల్ మండలం లోని లింబాద్రి గుట్ట కు చెందిన నాలుగు నెలల వేముల కార్తీక్ అనే బాలుడు ఇంజక్షన్ వికటించి చివరికి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణం గానే ఇలా జరిగింది అని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కొడుకు పుట్టాడు అన్న ఆనందం మా తల్లి దండ్రులకు ఎన్నో రోజులు మిగలలేదు అని చెప్పాలి.


 వడ్డెర కాలనీకి చెందిన వేముల రమ్య, రమేష్ దంపతులకు నాలుగు నెలల కుమారుడు కార్తీక్ ఉన్నాడు. ఇటీవలే బాబాపూర్ లోని సబ్ సెంటర్ లో నెలవారి టీక ఇప్పించారు. టీకా ఇప్పించిన మర్నాడే నాలుగు నెలల బాలుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం తో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఇక అక్కడికి వచ్చిన డాక్టర్ రాజ్కుమార్ పోస్టుమార్టం నిర్వహిస్తే బాలుడు మరణానికి అసలు కారణమేంటో తెలుస్తుందని చెప్పడం గమనార్హం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: