
ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడితో ఆ యువతి ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ అంతలో కుటుంబ సభ్యులు వేరొకరితో ఆమెకు పెళ్లి చేసి దుబాయ్ పంపించేశారు. కానీ మాజీ ప్రియుడిని మర్చిపోలేకపోయింది ఆ యువతి. ఇక అతను కోరడంతో మళ్ళీ హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చింది. అయితే ఇక ఇలా తనకోసం తిరిగి వచ్చిన ప్రియురాలితో సహజీవనం చేసిన యువకుడు కొన్నాళ్ళకు ముఖం చాటేసి వేరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్ నగరంలోని బోరబండ రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి టెలికాలర్గా పనిచేస్తుండగా.. ఇంస్టాగ్రామ్ లో ఐదేళ్ల క్రితం మహారాష్ట్ర జెల్ గావ్ కు చెందిన సైఫ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇక పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు సహజీవనం కూడా చేయడం మొదలుపెట్టారు. అయితే కుటుంబ సభ్యులు ఇక వేరొకరితో పెళ్లి చేసి యువతిని దుబాయ్ పంపించిన ప్రియుడు కోసం మళ్లీ హైదరాబాద్ కి వచ్చింది. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సైఫ్ కొన్నాళ్లపాటు సహజీవనం చేసి ఆ తర్వాత ముఖం చాటేసాడు. దీంతో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.