సాధారణం గా చిన్నారులు చేసే పనులు కొన్ని కొన్ని సార్లు అనుకొని ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే చిన్నారులకు ఏది మంచి ఏది చెడు అన్న విషయం తెలియదు. అందుకే ఇక తమకు నచ్చింది చేసేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమం లోనే తల్లిదండ్రులు ఎప్పుడు చిన్నారులను ఒక కంట కనిపెడుతూ ఉండాలని అటు నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమం లోనే  ఇటీవల కాలం లో ఎంతో మంది చిన్నారులు తెలిసి తెలియక చేసిన పనుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చాలానే వెలుగు లోకి వస్తున్నాయి. ఇక ఇటీవల నాలుగేళ్ల పాప విషయం లో ఇలాంటిదే జరిగింది. ఏకంగా గొంతు లో విజిల్ ఇరుక్కు పోయింది అని చెప్పాలి. బెహ్రెయిన్ లో జరిగిన నస్ప వేడుకల్లో చిన్నారి పాల్గొంది. ఇక విజిల్ ను మిఠాయి అనుకుని నోట్లో పెట్టుకుంది. తర్వాత మింగేసింది. అయితే ఆ విజిల్ ఏకంగా గొంతు లోకి వెళ్లి ఇరుక్కుంది అని చెప్పాలి. దీంతో శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడింది చిన్నారి.


 గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఇక చికిత్స చేసిన వైద్యులు ఆ చిన్నారి గొంతు లో నుంచి విజిల్ను విజయవంతం గా తొలగించారు. ఇక అధునాతన ఎండోస్కోప్ ను ఉపయోగించి విజిల్ను బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్లో కెమెరాతో కూడిన ట్యూబ్ శ్వాసనాలం లోకి పంపిస్తారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని వైద్య బృందం విడుదల చేసింది. అయితే తల్లిదండ్రులు పిల్లలు తినే  సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనలో తమ కూతురు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: