ఒక్కసారి చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావడం అంటే అది అసాధ్యం అని చెప్పాలి . కేవలం సినిమాల్లో తప్ప అటు నిజజీవితంలో మాత్రం అది సాధ్యం కాదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇలాంటి తరహా ఘటనలు అటు నిజజీవితంలో కూడా జరుగుతున్నాయి. చనిపోయాడు అని అనుకున్న వ్యక్తి ఎన్నో రోజుల తర్వాత మళ్లీ కళ్ళ ముందు వాలిపోవడంతో ఇక అది నిజమా లేకపోతే కలా అన్నది కూడా నమ్మలేని పరిస్థితి కొంతమందికి ఎదురవుతుంది.



 చనిపోయాడు అని కొన్ని రోజులు బాధపడి ఇక అతన్ని మరిచిపోయిన కుటుంబ సభ్యులు.. ఒక్కసారిగా అతను కళ్ళ ముందు వాలిపోవడంతో షాక్ అవుతున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఏకంగా కరోనా వైరస్ సోకి చనిపోయిన వ్యక్తి దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి రావడంతో అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. కళ్ళ ముందు కనిపిస్తుంది నిజమేనా లేకపోతే భ్రమ పడుతున్నామ అన్న విషయం కూడా తెలియక అలా చూస్తూ ఉండిపోయే పరిస్థితి వారికి ఏర్పడింది అని చెప్పాలి.

 ఈ ఘటన మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కమలేష్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం కరోనా వైరస్ భారీనా పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇక కుటుంబ సభ్యులను అతన్ని చూసేందుకు కూడా అనుమతించని అధికారులు.. వారే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇవ్వలే రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన కమలేష్ అసలు విషయాలు చెప్పాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒక ముఠా అదుపులో ఉన్నానని.. తనకు డ్రగ్స్ ఇచ్చేవారని కమలేష్ తెలిపాడు. ఈ ఘటన కాస్త సంచలనం గా మారగా.. ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి. అయితే కరోనా వైరస్ తో చనిపోయినట్లు అటు అధికారులు ఎందుకు అబద్ధాలు చెప్పారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: