భార్య భర్తల బంధం లో ఇటీవలి కాలంలో అన్యోన్యత అనేది ఎక్కడా కనిపించడం లేదు కలకాలం సంతోషంగా జీవించేందుకు  పెళ్లి చేసుకున్న భార్య భర్తలు చిన్నచిన్న కారణాలకే విడిపోతున్న ఘటనలు  వెలుగులోకి  వస్తున్నాయ్. ఇటీవల కాలంలో ఎంతో మంది భర్తలు తమ భార్యలకు ఎంతో సులభంగా త్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇస్తున్న ఘటనలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఇక ఇలాంటి ఘటనలతో  మహిళలు షాక్ లో మునిగిపోతున్నారు.  ఇక్కడ ఇలాంటిదే జరిగింది. త్రిపుల్ తలాక్ చెప్పి తన భార్యకు విడాకులు ఇచ్చాడు భర్త.


 విడాకులు ఇచ్చిన తర్వాత సదరు మహిళను మళ్లీ భార్యగా స్వీకరించాలి అని అనుకున్నాడు. అంతకుముందు తన అన్నయ్యతో హలాలా కు సిద్ధం కావాలి అంటూ భార్యకు సూచించాడు. కానీ సదరు మహిళ మాత్రం నిరాకరించింది. దీంతో భార్య ముఖంపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని బరేలి లో వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్ల క్రితం నస్రిన్ ను వివాహం చేసుకున్నాడు ఇషాక్. వీరి దాంపత్య బంధానికి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు కూడా జన్మించారు. ఇక ఇటీవలే భార్యాభర్తల మధ్య గొడవ జరగగా మద్యం మత్తులో తన భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పేసాడు ఇషాక్.


 ఈ క్రమంలోనే సదరు మహిళ భర్త పై ఎలాంటి కేసు పెట్టకుండా సైలెంట్ గానే ఉండిపోయింది.  ఆ తర్వాత పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే నస్రిన్ ను మళ్లీ భార్యగా  తీసు కోవాలని అనుకొన్నాడు ఇషాక్. కాని ఒక షరతు పెట్టాడు. మళ్లీ తనతో కలిసి జీవించాలంటే అన్నయ్యతో హలాల చేసుకోవాలి అంటూ తెలిపాడు. నస్రిన్ అందుకు అంగీకరించకపోవడంతో  యాసిడ్ దాడి చేశాడు. ఇంతకీ హలాల అంటే ఏమిటంటే.. విడాకులు తీసుకున్న ఒక ముస్లిం మహిళ మళ్లీ అదే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే దానికి ముందు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత అతనికి విడాకులు ఇవ్వడం లేదా అతడు మరణించే వరకు ఉండడం చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితే ఆమె మళ్లీ తన భర్తను పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్నే హలాల అంటారు .

మరింత సమాచారం తెలుసుకోండి: