జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కోసారి ఏదో రాయబోయి ఇంకేదో రాసేస్తోంది ఎల్లోమీడియా. తాజాగా ’దొంగచాటుగా కాటు’ అనే హెడ్డింగ్ పెట్టి జగన్ గురించి ఓ నెగిటివ్ కథనం రాయాలన్నది ఎల్లోమీడియా అసలు ఉద్దేశ్యం. అవసరానిక వాడుకుని వదిలేశాడని, తటస్తులను చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ప్రయోగించాడని ఎల్లోమీడియా చెప్పదలచుకున్నట్లుగా హెడ్డింగ్ చూసిన వాళ్ళకు అర్ధమవుతుంది. కానీ కథనం పూర్తిగా చదవిని తర్వాత అర్ధమయ్యేదేమంటే జగన్ కు పాజిటివ్ గా ఉందనే. ఇదే సందర్భంగా జగన్ కు చంద్రబాబు పోలిక కూడా అనివార్యంగా వస్తుంది. అవసరానికి వాడుకుని తర్వాత వదిలించుకుంటాడనే పేరు చంద్రబాబుకు ఎంతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ గురించి నెగిటివ్ గా కథనం రాస్తున్నామనుకున్న ఎల్లోమీడియా మరోమారు చంద్రబాబు గుణాన్ని జనాలకు గుర్తుచేసి ఫార్టీ ఇయర్స్ ఇండ్ట్రీనే బాగా డ్యామేజ్ చేస్తున్నట్లు ఎల్లోమీడియా గుర్తించినట్లు లేదు.




ఇక అసలు విషయంలోకి వద్దాం. ఎల్లోమీడియా చెప్పదలచుకున్నదేమంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు కొందరు తటస్తులను చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ ఉపయోగించుకున్నాగట. తాను అధికారంలోకి రాగానే వాళ్ళల్లో చాలామందిని వదిలించేసుకున్నాడని కూడా రాసింది. అప్పట్లో టిటిడి ప్రధానార్చకుడు రమణదీక్షితులు, మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, అజేయకల్లం, జస్టిస్ ఈ శ్వరయ్య , ముద్రగడ పద్మనాభం పేర్లను ఉదహరించింది. అయితే ఇందులో కూడా కొన్ని తప్పుడు విషయాలు రాసింది లేండి. ముందుగా ఈశ్వరయ్య గురించి చూద్దాం. బిసి వర్గానికి చెందిన ఈశ్వరయ్యకు పదోన్నతి రాకుండా అడ్డుకున్నది స్వయంగా చంద్రబాబు. ఈశ్వరయ్యకు వ్యతిరేకంగా  సుప్రింకోర్టుకు చంద్రబాబు రాసిన లేఖ బయటపడింది. దాంతో జస్టిస్ చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని బిసి సంఘాల మద్దుతుతో రాష్ట్రంలో సమావేశలు పెట్టి చంద్రబాబును ఏకిపారేశాడు. దాన్ని వైసిపి అడ్వాంటేజ్ తీసుకున్నది.




ఇక ఐవైఆర్ కృష్ణారావు రిటైర్ అయిన తర్వాత చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా నియమించారు. ఆ తర్వాత కార్పొరేషన్ ద్వారా పంపిణి చేసే నిధుల విషయంలోనే కాకుండా సిబ్బంది నియామకాల్లో కూడా ప్రభుత్వం తరపున ఐవైఆర్ కు ఇబ్బందులు మొదలయ్యాయి. నిధుల పంపిణిలో అప్పటి మంత్రులు, ఎంఎల్ఏల నుండి ఛైర్మన్ పై ఒత్తిళ్ళు కూడా వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని చెప్పుకుందామని ఐవైఆర్ ప్రయత్నిస్తే చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. దాంతో ఛైర్మన్ మీడియాకెక్కాడు. దాంతో ఛైర్మన్ గా ఐవైఆర్ ను చంద్రబాబు తీసేశాడు. అయితే ఐవైఆర్ రాజీనామా చేశాడని ఎల్లోమీడియా చెప్పటం గమనార్హం. ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని అనేక సమావేశాల్లో ఐవైఆర్ చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే.. పనిలో పనిగా రాజధాని అమరావతి నిర్మాణంపైన కూడా ఐవైఆర్ అనేక ఆరోపణలు చేశాడు.  అవన్నీ సహజంగానే వైసిపికి ప్లస్ అయ్యాయి.




రమణ దీక్షితులు కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశాడు. తిరుమలలో స్వామివారి పింక్ డైమెండ్ మాయమైపోయిందని, నగలు కూడా కనిపించటం లేదంటూ ఆరోపణలు చేశాడు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాని చంద్రబాబు 65 ఏళ్ళ రిటైర్మెంట్ అనే నిబంధనను తెరమీదకు తెచ్చి రమణదీక్షితులను ప్రధానర్చకునిటా పీకేసింది. ఆ తర్వాత ఆయన కూడా చంద్రబాబును టార్గెట్ చేసుకున్నాడు. దాన్ని వైసిపి అడ్వాంటేజ్ తీసుకున్నది. మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం విషయం చూద్దాం. ఎన్నికల కమీషనర్ ద్వారా ప్రధాన కార్యదర్శి అయిన ఎల్వీ చంద్రబాబుకు సహాయ నిరాకరణ చేసిందని ఎల్లోమీడియా చెప్పింది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎల్వీ సహాయ నిరాకరణ చేయలేదు. ఎన్నికల నిబంధనావళి ప్రకారం చంద్రబాబు చేసిన సమీక్షా సమావేశాలకు హాజరుకూకడదు కాబట్టే తాను హాజరుకాలేదు. ఉన్నతాధికారులను కూడా హాజరవద్దని చెప్పాడంతే. అంతకుముందు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనీల్ చంద్రపునేత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి చంద్రబాబు చెప్పినట్లే నడుకుకున్నాడు కాబట్టే ఎన్నికల కమీషన్ పునేతాను తీసేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవటం చంద్రబాబుకు సహాయ నిరాకరణ ఎలా అవుతుందో ఎల్లోమీడియానే చెప్పాలి.




నెల రోజుల్లో రిటైర్ అవుతారని తెలిసి కూడా అజేయకల్లంను చంద్రబాబు ప్రధాన కార్యదర్శిగా నియమించాడని రాసింది. అంటే పోనీలే అని కల్లంకు ప్రధాన కార్యదర్శి పదవిని చంద్రబాబు బిక్షగా వేసినట్లుగా ఎల్లోమీడియా రాసింది. నెల రోజులు కాదు పది రోజులున్నా ఇవ్వాల్సిన పోస్టు ఇవ్వాల్సిందే. కాబట్టే కల్లంను చంద్రబాబు కూడా ప్రధాన కార్యదర్శిగా నియమించాడు. తర్వాత రిటైర్ అయిన కల్లం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై  అనేక సభల్లో ఆరోపించాడు. అవి వైసిపికి అడ్వాంటేజ్ అయితే అయ్యుండచ్చు. చివరగా ముద్రగడ విషయం తీసుకుందాం.  2014 ఎన్నికల సందర్భంగా  కాపులను బిసిల్లోకి చేరుస్తాననేది చంద్రబాబు తప్పుడు హామి ఇచ్చాడు. తర్వాత అధికారంలోకి వచ్చాడు కాబట్టే తానిచ్చిన హామీని నెరవేర్చమని చంద్రబాబును ముద్రగడ తగులుకున్నాడు.




తానిచ్చిన హామీనే చంద్రబాబు పట్టించుకోకపోయేసరికి ఉద్యమం మొదలుపెట్టాడు.  ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ అందరికీ తెలిసిందే. ఇక్కడ విచిత్రమేమిటంటే జగన్ అకారంలోకి వచ్చిన తర్వాత కాపులకు రిజర్వేషన్ పై ఉద్యమాలు చేయాల్సిన ముద్రగడ అస్త్రసన్యాసం చేశాడని ఎల్లోమీడియా చెప్పటం. కాపులకు రిజర్వేషన్ అన్నదే తప్పుడు హామీ అని అందరికీ తెలుసు. కాబట్టే జగన్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తాను ఎన్ని ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదని ముద్రగడకు అర్ధమైపోయింది. అందుకనే వేరేదారి లేక అస్త్రసన్యాసం చేసేశాడు. అప్పట్లో ముద్రగడ చేసిన ఉద్యమాలు కూడా వైసిపినే చేయించదనే కలరింగ్ ఇచ్చింది తన కథనంలో.




మొత్తం కథనం తర్వాత అర్ధమయ్యేదేమంటే జస్టిస్ ఈశ్వరయ్యకు చంద్రబాబు అన్యాయం చేస్తే జగన్ అధికారంలోకి రాగానే ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమీషన్ ఛైర్మన్ గా నియమించాడు. ఐవైఆర్ ఎన్నికలకు ముందే బిజెపిలో చేరాడు. రమణదీక్షితులును చంద్రబాబు ఇంటికి పంపించేస్తే జగన్ ఆదరించాడు. దీక్షితులును ఆగమశాస్త్ర సలహాదారునిగా నియమించటమే కాకుండా గౌరవ ప్రధానార్చకునిగా కూడా నియమించాడు. అజేయ కల్లంను తన  ప్రభుత్వ  సలహాదారునిగా నియమించాడు. ఎల్లోమీడియాలో కథనం చదివిని తర్వాత అవసరానికి వాడుకుని వదిలేసేదెవరు ?  అంటే చంద్రబాబే అన్న విషయం గుర్తుకొస్తే అది పాఠకుల తప్పు కానేకాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: