కోడెల శివప్రసాద్ చనిపోయిన దగ్గర నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి..అసలు సత్తెనపల్లి ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు..సత్తెనపల్లి సీటు ఎవరికి ఫిక్స్ చేస్తారో అర్ధం కాకుండా ఉంది. బేసిక్‌గా సత్తెనపల్లిలో టీడీపీకి పెద్ద బలం లేదు. టీడీపీ ఆవిర్భావించక ఇక్కడ మంచి విజయాలు సాధించలేదు. ఏదో 1999లో ఒకసారి..మళ్ళీ 2014లో మాత్రమే సత్తెనపల్లిలో టీడీపీ గెలిచింది. అయితే అంతకముందు టీడీపీ సపోర్ట్‌తో సి‌పి‌ఎం గెలిచింది.

అయితే టీడీపీ డైరక్ట్‌గా గెలిచింది మాత్రం రెండుసార్లు. అంటే సత్తెనపల్లిలో టీడీపీ ఎంత వీక్‌గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కాస్త పరిస్తితులు మారాయి. పైగా కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి వచ్చి 2014లో గెలిచారు. అక్కడ నుంచి సత్తెనపల్లిలో పార్టీ బలపడటం మొదలైంది. 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ గాలిలో కోడెల ఓటమి పాలయ్యారు. కోడెల ఓడిపోవడం, ఆ తర్వాత ఆయన చనిపోవడంతో సత్తెనపల్లిలో టీడీపీకి సరైన నాయకత్వం లేదు.

అయితే ఎటువంటి తలనొప్పులు లేకపోతే సత్తెనపల్లి సీటు కోడెల తనయుడు శివరాంకు కేటాయించేవారు. కానీ శివరాంకు సీటు ఇవ్వొద్దని టీడీపీలోని కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. శివరాంకు సీటు ఇస్తే ఓడిస్తామని కూడా అంటున్నాయి. అదే సమయంలో ఈ సీటు కోసం రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు ట్రై చేస్తున్నారు. ఒకవేళ రాయపాటి ఫ్యామిలీకి సీటు ఇస్తే, కోడెల వర్గం ఆగ్రహంగా ఉంటుంది. దీంతో చంద్రబాబు సీటు ఫిక్స్ చేయలేకుండా ఉన్నారు.

ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు సత్తెనపల్లిలో యాక్టివ్ అయ్యారు. ఇటీవల ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేశాయి. దీంతో వైవీ కూడా రేసులోకి వచ్చినట్లు అయింది. మరి వీరిలో చివరికి సత్తెనపల్లి సీటు ఎవరికి ఫిక్స్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: