పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న కాలుష్యాన్ని 2 నుంచి ఒకటిన్నర శాతం ఉన్న కాలుష్య స్థాయికి తగ్గిస్తామని అగ్ర రాజ్యాలు చెబుతున్నాయి. కాలుష్యకారకాలైన పెట్రోల్ , డీజిల్ వాహనాలను తగ్గిస్తామని అగ్ర రాజ్యాలు ఒకవైపు చెపుతున్నాయి. కానీ ఆర్థికంగా చిన్నవైన చైనా, భారత్ లాంటివి కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి వాటికి మరికొంత సమయం అవసరం అంటున్నాయి. మరికొన్ని సంవత్సరాలు అంటే 2070 దాకా పడుతుందని ఈ దేశాలు చెప్తున్నాయి.


అయితే..  పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం అత్యంత పరిగణీయమైన అంశం కాబట్టి ఆ కాలుష్యాన్ని తగ్గించే క్రమంగా చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఒక 8 దేశాలు మాత్రం కార్బన్ ఉధ్గార శాతాన్ని 1 & 1/2 శాతానికి తగ్గించి మిగిలిన దేశాలకు ఆదర్శప్రాయంగా ఉన్నాయి. ఆ దేశాలు ఏంటంటే.. నీవ్, పనామా, సురినామ్, గయానా, గబోన్, కామెరూన్‌, మడగాస్కర్,భూటాన్.. ఈ దేశాలు కర్బన ఉద్గార శాతాన్ని తగ్గించి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి పూనుకున్నాయి.


కానీ ఆ ఎనిమిది దేశాలు మిగిలిన దేశాలతో పోలిస్తే చాలా చిన్న దేశాలు.  అవి చిన్న దేశాలు కావడంతో అక్కడ జనాభా తక్కువగా ఉండటం వల్ల  వ్యాపారం ఇంకా రవాణా  లాంటివి.. కూడా తక్కువగా ఉండటం వల్ల కార్బన్ ఉధ్గార శాతాన్ని తగ్గించడం ఆ దేశాల్లో వీలు పడింది. కాబట్టి ఈ విషయంలో ఈ ఎనిమిది దేశాలతో మిగిలిన దేశాలను పోల్చి చూడడం సరికాదు. ఎందుకంటే అన్ని దేశాల్లోనూ ఈ ఎనిమిది దేశాలలో ఉన్న పరిస్థితులు ఉండవు.


మరోవైపు ఈ కర్బన ఉధ్గార శాతాన్ని తగ్గించి పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి అన్ని దేశాలు ప్రయత్నిస్తున్న సమయంలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పెట్రోల్ డీజిల్ ఇంకా గ్యాస్ వినియోగం ఎక్కువ అవ్వడంతో వాటి కొరత అధికంగా కనిపిస్తుంది. దాంతో రవాణా మరియు వాణిజ్య కార్యక్రమాలు ఇంకా అనేక అవసరాల నిమిత్తం తిరిగి బొగ్గు ఆధారిత విద్యుత్ అవసరం చాలా దేశాలకు పడుతుంది. దాంతో తిరిగి పర్యావరణ కాలుష్య నియంత్రణ అనేది ప్రశ్నార్ధకం అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: