చాలా తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు తయారు చేసే దేశంగా భారత్ ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా దీని ప్లేస్ లో చైనా ఉంటూ వచ్చింది. చైనా మొబైల్స్ కానీ మరొకటి గాని మరొకటి గాని ఇలా చైనా వస్తువులపై మనం కూడా మనసు పారేసుకున్నాం. ఇప్పుడు భారత్ కూడా తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు తయారు చేసే పోటీలో వందకు వంద పాయింట్లు సంపాదించి చైనాను అధిగమించింది. అలా భారత్ ప్రథమ స్థానంలో ఉంటే రెండో స్థానంలో చైనా ఉంది. ఆ తర్వాత మూడవ స్థానంలో వియత్నం ఉంది.. ఇక నాలుగవ స్థానంలో థాయిలాండ్ ఉంటే ఐదో స్థానంలోఫిలిప్పీన్స్ దేశాలు.. ,ఇలా వరుసగా భారత్ తర్వాత ప్లేస్ లో ఉన్నాయి.


తక్కువ ధరకి నాణ్యమైన వస్తువులు తయారు చేసే క్రమంలో మనం ఎప్పుడో ముందంజలో ఉండాలి. అది ఇప్పటికి సాధ్యపడింది. మన దగ్గర తక్కువ ధరకు దొరికే పత్తిని చైనా కొనుక్కొని అది బంగ్లాదేశ్ లోని తక్కువ  జీతానికి వచ్చే లేబర్ లతో పని చేయించుకుంటుంది. అక్కడ కార్మికులకు ఇండియా కరెన్సీలో అయితే 80 రూపాయలు 90 రూపాయలు జీతం ఇవ్వాల్సి ఉంటే.. చైనా కరెన్సీలో  30 రూపాయలు 40 రూపాయలు మాత్రమే ఇస్తే సరిపోతుంది. ఆ విధంగా వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గి లాభాలు పొందే వారు.


కరోనా  ప్రభావంతో అక్కడ బంగ్లాదేశ్‌లో  పరిశ్రమలు మూతపడితే చైనా ఆదుకోకపోగా చైనా మనసు మార్చుకుని వియత్నాంలో యూనిట్స్ పెట్టి అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. దాంతో భారతదేశం గుజరాత్, బీహార్, ఉత్తర ప్రదేశ్‌లో తాను కూడా యూనిట్లను ప్రోత్సహించింది. ఆ రకంగా తక్కువ ధరకే ఉత్పత్తులను తయారుచేసే దేశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే ఇలా మరెన్నో తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను తయారు చేసే విధానం మొదలు పెట్టి భారత్ చైనా ను అధిగమించి ప్రథమ స్థానంలో నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: