యూరప్ దేశాలకు 40 శాతం పెట్రోల్, డీజిల్ అందించేంది రష్యా. కొన్ని దేశాలకు అయితే ఏకంగా 80 శాతం వరకు ఇచ్చేది. ఇప్పుడు అమెరికా ఆ దేశాలతోనే రష్యాపై ఆంక్షలు పెట్టించి రష్యా నుంచి ఏమి కొనకుండా చేసి అమెరికాలో ఉత్పత్తి అవుతున్న చమురును ఎక్కువ ధరకు యూరప్ దేశాలకు అమ్ముకుంటోంది. రష్యా 60 డాలర్లకు ఇస్తుంటే, అమెరికా ప్రస్తుతం 150 డాలర్లకు పెట్రోల్, డీజిల్ అమ్ముతోంది. షిప్పుల్లో వచ్చే ఆయిల్ ను ఆపేసింది. పైపుల ద్వారా వచ్చే ప్రాంతాల్లో ధ్వంసం చేసింది.


రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు, సౌదీ యువరాజు సల్మాన్ తో చర్చలు జరిపారు. యూరప్ దేశాలకు చమురు ఇవ్వాలని కోరారు. లక్షకు పైగా చమురు బ్యారెళ్ల ఉత్పత్తి పెంచాలని చెప్పారు. పనిలో పనిగా ఖషోగ్గి హత్య కేసుపై మాట్లాడారు. దీనిపై సౌదీ యువరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైడెన్ సౌదీని రోజు లక్ష్క్ష బ్యారెళ్ల ఆయిల్ ఉత్పత్తి పెంచాలని కోరితే సౌదీ 2 లక్షల బ్యారెళ్ల చమురు తగ్గించి ఎక్కువ ధరలకు సరఫరా చేయడం మొదలు పెట్టింది.


మిగతా అరబ్ దేశాలు సైతం నిల్వలను తగ్గించేశాయి. సౌదీ అరేబియా ప్రస్తుతం మళ్లీ చమురు ధరలను అమాంతం పెంచేసింది. ఒక బ్యారెల్ చమురుకు 2 డాలర్ల కు పైగా ధరలను సౌదీ పెంచేసింది. యూఎస్, యూరప్ దేశాలకే కాకుండా ఆసియాలోని అన్ని దేశాలకు ఆయిల్ ధరలను పెంచింది.


అమెరికా చెప్పినప్పటికీ కూడా సౌదీ వినకుండా చమురు రేట్లను పెంచడంతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యూరప్ దేశాలు లబోదిబోమంటున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయనే చెప్పొచ్చు. ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న  దేశాలకు ఆయిల్ ధరలు పెరగడం అనేది తలకు మించిన భారమనే చెప్పాలి. ఇప్పుడు సౌదీ ఆయిల్ ధరలు పెంచడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్లట్లయింది యూరప్ దేశాల పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: