కశ్మీర్ ను సుదీర్ఘ కాలం పాటు పాలించింది వేర్పాటు వాదులకు సంబంధించిన పార్టీలే. కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది. కానీ ప్రభుత్వాలు మారాయి. అక్కడ ఇప్పుడు నిధుల వరద పారుతోంది. ఉద్యోగాలు రావడం, టూరిజం డెవలప్ మెంట్, విద్య, ఉద్యోగ, ఉపాధి,  అభివృద్ధి జరుగుతోంది.  ఆర్టికల్, 370, 35 రద్దు తర్వాత అక్కడ పరిస్థితులు మారుతున్నాయి.


కానీ అక్కడ  ఉండే ప్రజలకు మతమౌడ్యం ఎక్కువన్న వాదన ఉంది. ఇప్పటి వరకు మత మౌడ్యానికి అలవాటయిన వారు అంత తొందరగా ఏం మారిపోరు. అయితే కశ్మీర్ లో ఒక గొప్ప అంశం బయటపడింది.  లిథియంకు సంబంధించిన నిల్వలు కశ్మీర్ లో ఉన్నాయని జువాలజికల్ సర్వే ఆప్ ఇండియా తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో లిథియం బ్యాటరీస్ ఉపయోగపడతాయి. మొదటి సారి ఇండియాలో ఇలాంటి నిల్వలు ఉన్నాయని తెలిసింది.


భారీ మొత్తంలో ఇవి ఉన్నట్లు తెలవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగే అవకాశం ఉంది. 5.9 మిలియన్ టన్నుల భారీ నిల్వలు ఇక్కడ ఉన్నట్లు పేర్కొంది. సలాల్ అల్మారా ఏరియా ఆప్ రేసీ డిస్టిక్ లో ఉన్నట్లు పేర్కొంది. ఇందులో  నికెల్, కోబాల్ట్, లిథియం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు జువాలజికల్ సర్వే ఆప్ ఇండియా కనుగొంది. అంటే కశ్మీర్ లో ఉన్న ఈ నిల్వలు ఇప్పటివరకు ఇండియాలోనే ఎక్కడా లేవు.


వీటిని బయటకు తీసి అమ్మడం ద్వారా కశ్మీర్ అభివృద్ధికి నిధులను సమకూర్చుకోవచ్చు.  ప్రస్తుతం పెట్రోల్, డిజీల్ ల వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ లో భారత్ దూసుకుపోవడానికి లిథియం బ్యాటరీలు అవసరం. అసలైన లిథియం నిల్వలు ఇక్కడున్నట్లు తెలిసింది కాబట్టి వీటిని భారత ప్రభుత్వం సరైన మార్గంలో తీస్తే గనక ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో ఇండియా అద్భుతాలను సృష్టించవచ్చు. దేశానికి ఆర్థికంగా కూడా చాలా వరకు దోహదపడుతుంది. ఈ నిల్వల్ని తీయడానికి  ప్రజలు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: