మన జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ వరుసగా అమెరికా, కెనడా, బ్రిటన్, రష్యా ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యటించారు. ఏ ఆర్బాట ప్రచారం చేయలేదు. ఆయనకు సంబంధించిన కౌంటర్ భద్రత సలహాదారులతో కూడా మాట్లాడలేదు. ప్రధాన‌ ఎజెండా కేవలం ఒక్క సిక్ ఫర్ జస్టిస్ సంస్థ. వాస్తవంగా దేశంలో ఒక పెద్ద కుట్ర బహిరంగంగానే జరుగుతున్నా, దాని విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలకే పరిమితం అవుతున్నాయి గాని, దేశం కోసం సిద్ధపడట్లేదు. ఎందుకంటే  దేశాన్ని ముక్కలు చేయాలన్నటువంటి కుట్ర అది.


సరే ఏ కాశ్మీర్ అంశమో ఇప్పుడు సరి చేస్తే మరో కొత్త కుట్ర లేదా మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. అదేంటంటే పంజాబ్ ను మన భారత్ దేశం నుండి వేరు చేయాలనే అంశం అది. ఖలిస్తానీ తీవ్రవాదులు ఈ దిశగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే  పోలీసులు మీద దాడులు జరుగుతున్నాయి, ఢిల్లీలో రైతుల వంకతో జరిగినటువంటిది ఎప్పుడైతే సక్సెస్ అయిందో, ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ రాజకీయాల కోసం ఆ వ్యవహారాన్ని ఎప్పుడైతే సమర్ధించుకుంటూ వచ్చినాయో, దాని పర్యవసానంగా పంజాబ్లో రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది.


ఇప్పుడు వాళ్ళ ద్వారా రాజకీయంగా ఎదగగలం అనుకునేటప్పటికీ, దాన్ని అడ్డు పెట్ఠుకుని పాకిస్తానీ మూకల హస్తంతో చేస్తున్నటువంటి చాలా దుర్మార్గమైనటువంటి పనులు భారతదేశాన్ని కలవరపెడుతున్నాయి. బ్లాక్ మనీ, డ్రగ్స్ సరఫరా చేయడం, ఆయుధాలు సరఫరా చేయడం ఇలా రకరకాల అసాంఘిక కార్యకలాపాలతో  అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు వారు. దీనికి కారణం అవుతున్నటువంటి అమెరికా, బ్రిటన్, కెనడాలో ఉన్నటువంటి దీని మూలాలకు సంబంధించినటువంటి వారి కదలికలపై ఒక కన్ను వేయమని అక్కడ ఉన్న భద్రతా సలహాదారులకు చెప్తూ వారిని కనక వదిలేస్తే పాకిస్తాన్ కి బీటీ మీది అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు‌ మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.

మరింత సమాచారం తెలుసుకోండి: