అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చైనా విదేశాంగ మంత్రితో మ్యూనిచ్ సదస్సులో మాట్లాడుతూ.. చైనా ఏ దేశాలకు యుద్ధ సామగ్రి, ఆయుధాలు ఇవ్వొద్దని హెచ్చరించారు. అయితే చైనా అమెరికా చెప్పిన మాటలను తీవ్రంగా ఖండించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కు సహకరిస్తూ ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేస్తోంది అమెరికా. మళ్లీ చైనా వేరే దేశాలకు ఆయుధాలను అమ్మవద్దని చెప్పడం విడ్డూరంగా ఉండని చైనా విదేశాంగ మంత్రి అన్నారు. అయితే చైనాను ఏ దేశం బెదిరించలేదని మేం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.


చైనా నుంచి కేవలం రా మెటిరియల్స్ మాత్రమే వివిధ దేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఆ రా మెటిరియల్స్ ను అమెరికాలోని చాలా కంపెనీలు చైనా నుంచి తీసుకుంటున్నాయి. అయితే వాటిని అమెరికా ఉక్రెయిన్ అందిస్తోంది. యుద్ధ రంగంలో వాటిని వాడుతున్నారు. అయినంతా మాత్రాన అవి చైనా ఇచ్చినట్లు కాదని పేర్కొంది. చైనా నుంచి కొనుగోలు చేసిన రా మెటిరీయల్స్ తో యుద్ధ సామగ్రిని ఆయుధాలను తయారు చేసుకొని వాటితో వ్యాపారం కొనసాగిస్తూ వివిధ దేశాలకు అమ్మేసుకుంటూ ఇతరులు ఆయుధాలు అమ్మవద్దని చెప్పడానికి మీరెవరని చైనా అగ్ర రాజ్యాన్ని ప్రశ్నించింది.


ముఖ్యంగా అమెరికా నుంచే వివిధ దేశాలకు ఆయుధాలు సరఫరా అవుతున్నాయని ప్రకటించింది. ఏ దేశం కూడా చైనాను భయపెట్టలేదని పేర్కొంది. అయితే మొన్నీమధ్య చైనాకు సంబంధించిన బెలూన్లు కూడా అమెరికాలో ప్రవేశించాయి. వీటి వల్ల ఏదైనా సమస్య ఏర్పడుతుందేమోనని అమెరికా వాటిని సముద్ర జలాల్లో పేల్చేసింది. దీని పర్యవసానమే చైనాపై ఏదో ఒక వంక పెట్టాలని అమెరికా చూస్తున్నట్లుంది. ఒక వేళ చైనాను డామినేట్ చేయాలంటే అమెరికాకు సాధ్యపడుతుందా.. ఏయే అంశాల్లో టార్గెట్ చేసే అవకాశం ఉంది. చైనాను ఇబ్బందిపెట్టే అంశాలు ఏముంటాయి. ఈ వివాదం  చైనా, అమెరికా మధ్య ఏన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: