మనవాళ్లు సంపాదించడానికి అమెరికా వెళుతున్నారు. కానీ అక్కడకు వెళ్లి కూడా ఇక్కడిలా కుల పిచ్చి ఏంటి? తాజాగా మొన్న కాపు కమ్మ గొడవ నిదర్శనం. మన దగ్గర కులపిచ్చి వల్ల ఎదుగుదల నాశనం చేసుకొని అక్కడికి వెళ్లి మళ్లీ అక్కడ కూడా అదే కులపిచ్చితో ఉంటున్నారు. ఇప్పుడు ఇది హిందూ ఫోబియాగా మారిపోయింది. హిందూ ధర్మం పట్ల ఆధారణ పెరిగే టైంలో ఈ హిందూ ఫోబియా పెరిగిపోతుంది.


తాజాగా వాషింగ్టన్ లో చేసినటువంటి ఒక చట్టం పైన ఉద్యమాలు జరుగుతున్నాయి. కుల వివక్ష అన్న అంశాన్ని కూడా నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్టం అది. భారతదేశంలో కూడా కుల వివక్ష చట్టం 1947-48లోనే వచ్చింది. ప్రత్యేకించి దళితులు వివక్షకు గురవకుండా చట్టాలను తీసుకొచ్చారు.  క్రైస్తవ దేశాలైన అక్కడ దేశాలు భారతీయులను హిందూ ఫోబియాతో దొంగల్ని చేస్తున్నాయని అంటున్నారు.


పాకిస్తాన్ భారత దేశంలా శక్తివంతంగా ఎదగాలి అంటే ఒక వందేళ్లు పడుతుంది, కానీ భారతదేశం పాకిస్థాన్ లా మారడానికి మాత్రం పది ఏళ్ళు చాలు. కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకొస్తేనో  లేదా కమ్యూనిస్టులు వేర్పాటు వాదులతో ఏవైనా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే చాలు, పది ఏళ్ళలో నాశనం చేసేస్తారని అంటుంటారు కొందరు.  మనదేశంలో ఎన్ని సార్లు బాంబు పేలుళ్ల సంఘటనలు జరిగాయో, జరిగినప్పుడు ఎవరో ఒకరిని అరెస్ట్ చేయడం ఆ తర్వాత కోర్టులు, వెంటనే మానవ హక్కులు పౌర హక్కులు రావడం,వాళ్ళంతా చెడగొట్టుకుంటూ వచ్చేవారు. చివరికి ఈ తీవ్రవాదులే ప్రభుత్వాలని ఏలే పరిస్థితికి వచ్చేసాయి.


అమెరికా యూరప్ దేశాలేమో విధానాలను శాసిస్తే ఈ తీవ్రవాదుల చేతుల్లోకి మన లా అండ్ ఆర్డర్ వెళ్లిపోయింది. దాన్ని సరి చేసే ప్రయత్నంలో వాజ్‌పేయి కూడా విఫలమయ్యారనే వాదన ఉంది. అలాంటిది ఇప్పుడు మోడీ వచ్చాక ఈ విషయం మీద గట్టిగా తలపడుతున్నాడు. విదేశాంగ విధానం, దౌత్య విధానం, గూడచార్య విధానం సక్సెస్ చేయడం వల్ల ఈ విషయంలో సక్సెస్ అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: