భారత్, పాక్ ల మధ్య నది జలాల ఒప్పందం రెండు దేశాల మధ్య జరిగింది కాదు. అప్పటి భారత దేశ నాయకులు పోనీలే అని ఉదారత చూపించిన వైనం. అయితే దాని టర్మ్ ఇప్పుడు పూర్తి అయిపోయింది. భారత్ లో ఉన్న జలాల్ని పాక్ ఇప్పటికి వాడుకుంటోంది. ఇన్ని రోజులు భారత్ ఈ విషయాన్ని వదిలేసింది.  ఇప్పుడు పాక్ చైనాతో చేతులు కలిపి భారత్ పై దాడులు చేయాలని ప్రయత్నిస్తోంది.


మన దేశాల్లో ఉన్న నీరు ఈశాన్య రాష్ట్రాలకు, కాశ్మీర్ లో ఉన్న రైతులకు అందడం లేదు. కానీ పాకిస్థాన్  వాడుకుంటోంది. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ లీడర్ అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు అప్పనంగా ఈ నీటిని వాడుకోవచ్చని రాసిచ్చారని చెబుతారు. ఇప్పుడు ఆ ఉదారతను వదిలించుకుని ఆ ప్రాంతంలో ఆనకట్ట కట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.


ప్రభుత్వం పాకిస్తాన్ వెళ్లే వాటా జలాలను నిలిపివేయాలని నిర్ణయించింది. తూర్పు నదుల నుంచి జలాలను మళ్లించి జమ్మూ కాశ్మీర్ , పంజాబ్ లోని ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. సట్లెజ్, బియాజ్, రావి, నదులను తూర్పు నదులని అంటారు. వీటిని పాకిస్తాన్ చేరకుండా అడ్డుకోవడం ద్వారా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న దాయాది దేశానికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.


అయితే హిమాలయాల్లో పుట్టిన సింధు నది ఉపనదులపై ఈ మూడు నదుల నీటిని యమునా నదికి తరలించేలా భారత్మాస్టర్ ప్లాన్ వేసింది. దీని వల్ల యమునా నది ద్వారా భారత్ లోకి పుష్కలంగా నీటి సరఫరా జరుగుతుంది. అయితే ఈ మూడు నదుల నీటిని ఇండియా తరలించడానికి ప్రయత్నాలు షురు చేయగానే పాక్ కు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. చూడాలి పాక్ అంతర్జాతీయంగా ఎలాంటి నిందలు వేస్తుందో.. అక్రమంగా నీటిని తరలించుకుపోయే ప్రణాళికను భారత ప్రభుత్వం రచిస్తోందని పాక్ భారత్ పై గతంలోనే ఆరోపణలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: