మతం అనేది జీవన విధానాన్ని తెలిపేలా ఉండాలి. కానీ మతమౌడ్యం పనికిరాదు. మతంలోని మంచితనాన్ని ఫాలో కావాలి. ఎదుటి వారిని తెలివిలేని వాళ్లుగా చూస్తూ మన మతమే గొప్పదిగా ఏనాడు భావించరాదు. కాలనుగుణంగా ప్రతి మనిషి మారాలి. పాకిస్థాన్ లో ఎయిర్ పోర్సు ఫైలెట్ గా చదివితే ప్రపంచంలో అంగీకరించరు. పాకిస్థాన్ లో డాక్టర్ గా పనిచేసిన వ్యక్తిని ఇండియాలో డాక్టర్ గా పనికిరాడు. అక్కడి చదువులకు ఉన్న వాల్యూ అది. ఆఫ్గాన్ లో ఒక్క చోట మాత్రమే పనికొస్తారు.


కొంతమంది మతానికి సంబంధించిన విధానాలు నూరి పోయడమే పనిగా పెట్టుకున్నారు. పాకిస్థాన్ లో ముస్లింలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను అడిగిన మరో ముస్లిం వ్యక్తినే మత ద్రోహివి అంటూ అతన్ని మట్టుబెట్టారు. అక్కడ ప్రస్తుతం టీచర్ల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఒక విద్యార్థి ఏకంగా టీచర్లను ప్రశ్నించాడు. మీరెవరూ నన్ను అనడానికి ఏమైనా చెప్పాలన్నా, నన్ను దండించాలన్నా అల్లా దయ ఉంటేనే సాధ్యమవుతుంది. మీరు మాత్రం నన్ను ఏమీ అనడానికి వీలు లేదని పాక్ లో టీచర్ తో ఒక పిల్లాడు అన్నారు. గతంలో ఎలాంటి విధానంలో అక్కడ బోధనలు జరిగాయో ఈ విషయమే చెబుతుంది.


మతాన్ని ప్రేమించాలి, గౌరవించాలి. కానీ మతమౌడ్యం మాత్రం పనికిరాదు. దీని వల్ల ఎంతో మంది చాలా రకాలుగా నష్టపోతున్నారు. మత పిచ్చి వల్ల ఎదుటి వారిని ప్రేమగా పలకరించరు. కేవలం తమ మతమే గొప్పదని భావిస్తూ ఉంటారు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ కొన్ని సంస్థలు తమ మతమే గొప్పది. విశ్వంలో మన బోధనలే అత్యున్నతమైనవని.. అంతకుమించి ఎవరివి ఉండవని చెబుతూ చిన్నప్పటి నుంచే పిల్లలో మౌడ్యాన్ని పెంచేస్తున్నారు. దీని వల్ల పెరిగి పెద్దయిన తర్వాత వారు చేసే పనులతో సమాజంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: