అదానీ మంచి వ్యాపారవేత్త. అలాంటి ఆదానిపై అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి ఒక నివేదిక ఇచ్చాడు. ఆ నివేదికను అడ్డు పట్టుకొని  అమెరికా నుండి అమలాపురం దాకా ప్రతి వ్యక్తి తిట్టిపోస్తున్నారు. మనం కూడా మన వాడిని భలే తిడుతున్నాడు రా అని ఎంజాయ్ చేశాం. అసలు ఇదంతా ఏంటంటే అదానీపై జరుగుతున్న కుట్ర అని తెలుస్తుంది. ఇదంతా అతనిపై జరుగుతున్న కుట్ర అని తెలిసి కూడా కామెంట్ చేసే వాళ్ళే ఎక్కువమంది ఉన్నారు మన దగ్గర కూడా.


ఇవాళ అమెరికాలో వరుస పెట్టి బ్యాంకులు దెబ్బతింటున్నాయి. ఈ విషయంపై మనం ఎంత మాట్లాడుకుంటున్నాం.. కొంతవరకు మాట్లాడుకుంటున్నాం తెలిసినంతవరకూ. పోనీ అమెరికా అగ్ర దేశం కాబట్టి మిగిలిన దేశాలు అంతర్జాతీయంగా ఈ విషయంపై ఏమైనా చర్చించుకుంటున్నాయా అంటే అది కూడా లేదని తెలుస్తుంది. అగ్ర దేశం కాబట్టి అమెరికా తట్టుకోగలదులే అనుకుంటున్నారు అంతే.


కానీ అమెరికాలో బ్యాంకింగ్ సెక్టార్ వరుస పెట్టి సంక్షోభానికి గురవుతుంది. ఇప్పటివరకు మూడు బ్యాంకులూ, తాజాగా నాలుగవ బ్యాంకు ఆరు బిలియన్ డాలర్ల తో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్కోకి సంబంధించిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్. దీనికి 6300 మంది కస్టమర్స్ ఉన్నారు. దీని పని కూడా అయిపోయిందని ఎస్ ఎంపీ గ్లోబల్ దానికి మైనస్ అనే రిపోర్టు ఇచ్చింది. జంక్ అనే రేటింగ్ కూడా ఇచ్చింది.


జనం అడిగితే  ఇవ్వడానికి  వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బు ఏమీ లేదు. ప్రభుత్వ బాండ్స్ లో తమ దగ్గర ఉన్నదంతా పెట్టుబడి పెట్టారు. దీంతో డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. వెస్ట్రన్ అలియన్స్ బ్యాంకు, యుఎన్బి ఫైనల్లీ ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ బ్యాంకు ఇవన్నీ కూడా ఇదే బాటలో ఉన్నాయని మూడీస్ నివేదిక చెప్తుంది. తాజాగా 130 బ్యాంకులు 206 మిలియన్ డాలర్ల నష్టంతో ఉన్నాయని నివేదకలు చెబుతున్నాయి.  ప్రతి బ్యాంకులో కూడా ఐదు బిలియన్ల డాలర్ల ఆస్తులు అక్కడ నష్టంలో ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: