
ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదుకాని ...నిన్న మల్లిఖార్జున ఖర్గేకి డి శ్రీనివాస్ లేఖ రాశారు. తన కుమారుడు డి.సంజయ్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా ఆశీస్సులు ఇచ్చేందుకు గాంధీభవన్ వెళ్లినానని.., ఆ సందర్భంగా తనపై కండవా వేశారన్నారు. దీంతో తాను కూడా పార్టీలో చేరినట్లు మీడియా ప్రచారం చేసిందని అన్నారు.
తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని కాని వయస్సు రీత్యా, ఆరోగ్యపరిస్థితులు దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నట్లు డీ శ్రీనివాస్ వివరించారు. పార్టీలో తన చేరికకు బి సంజయ్ టికెట్కు ముడి పెట్టొద్దని డీ శ్రీనివాస్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందని డీ శ్రీనివాస్ తెలిపారు. ఆరోగ్య రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న తనను వివాదాల్లోకి లాగొద్దని డీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీలో తాను మల్లీ చేరినట్లు భావిస్తే ఈ లేఖను తన రాజీనామాగా భావించి ఆమోదించాలని మల్లిఖార్జున ఖర్గేకి డీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ లేఖతోపాటు ఆయన భార్య ధర్మపురి విజయలక్ష్మి కూడా స్పందించారు. రాజకీయాలు చేసే సమయం కాదని, పార్టీలో చేర్చుకునే పద్దతి కూడా ఇది కాదని ఆమె స్పష్టం చేశారు. దయచేసి మీడియా వాళ్లు ఎప్పుడు తమ ఇంటి వైపు రావద్దని డీ శ్రీనివాస్ భార్య సూచించారు.