ఎన్నికలలో ఎవరి ఎత్తుగడలు వారికుంటాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ ఫలించింది. సక్సెస్ అయింది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎత్తుగడ ఫెయిల్ అయింది. అయినా ఈ గ్రాడ్యుయేట్ సక్సెస్ ని హైలెట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. అలాగే ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి సాధించడం ద్వారా సంబరం చేసుకొని తద్వారా జనంలో తెలుగుదేశం పార్టీ శకం ప్రారంభమైందనే ఫీలింగ్ ని తీసుకువస్తుంది. అది టిడిపి స్ట్రాటజీ.


జగన్ స్ట్రాటజీ లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కావాలని ఓడిపోయినట్లు కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే టీచర్స్ ఎన్నికల్లో మేనేజ్ చేసిన వాళ్ళు దీంట్లో మేనేజ్ చేయలేరా?  అన్నటువంటిది వాళ్ళు సందేహించే విషయం. టిడిపి జనసేన పొత్తు పెట్టుకోవాలి. టిడిపి ఇచ్చే సీట్లు జనసేన తీసుకునే స్థాయిలో ఉంటే ఒక ఆస్పెక్ట్ లో అప్పుడు కాపుల్లో అసంతృప్తి వస్తుంది.ఒక 20 తీసుకుని పోటీ చేశారనుకోండి. పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద అసంతృప్తి వస్తుంది. తద్వారా కాపులు ఓట్లు డివైడ్ అయిపోతాయి. ఒక జనసేన పోటీ చేసిన చోట మాత్రమే వాళ్ళు పట్టించుకుంటారు. మిగతా చోట పట్టించుకోరు.


పవర్ షేరింగ్ మాట వచ్చేసరికి మొన్నటిదాకా వెంటపడే వాళ్ళు జనసేన మాట ఎత్తడం లేదు. అదే జగన్ వేసిన ఎత్తుగడ అని కాన్సెప్ట్ ఒకటి డౌట్ ఫుల్. ఇదే ఇప్పుడు నాగబాబు గారికి అత్యంత సన్నిహితుడు అలానే జనసేన అధికార ప్రతినిధుల్లో ఒకరైనటువంటి శ్రీనివాస్ కుసుంపూడి ట్రై చేశారు. మళ్లీ మనం అధికారంలోకి రావాలంటే ఇక ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు ఒంటరిగా నిలబడి అధికారానికి రాగలము అని భావన తెలుగుదేశం పార్టీ నేతల్లో బలంగా కలిగించి ప్రతిపక్ష పార్టీలు ఏకం కాకుండా ఎవరికి వాళ్లు విడివిడిగా పోటీ చేసేలా చేసి తద్వారా తనకు వ్యతిరేకంగా జత కట్టే పార్టీలను కలవకుండా వేరు చేసే ప్రక్రియ ఇది అని తెలుస్తుంది. ఇదే జగన్ ఎత్తుగడ అని వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: