జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి అందర్నీ ఒక తాటిపైకి తీసుకురావడమే తమ ఉద్దేశమని, అందులో భాగంగానే కేంద్రంతో  కలిసామంటూ తాజాగా మనోహర్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్ ని గద్దించటానికి విపక్షాలందరు ఉమ్మడి కుటుంబంలా కలుద్దాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు అంటే అది ఉమ్మడి కుటుంబంలా కలిసుంటేనే సాధ్యమని ఆయన చెప్తున్నారు.


ఈ ఉమ్మడి కుటుంబంలోకి తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బిజెపి అందరూ కలిసి ఒక తాటి పైకి రావడం ద్వారా అప్పుడు  ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వననే మాటకి అర్థం వస్తుందని వాళ్ళ అంతరార్థం. వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నది అనే విషయం అటు ఉంచితే, కమ్యూనిస్టులకి, బిజెపిలకు పడదు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. తెలుగుదేశం పార్టీ అంటే బిజెపి ఒప్పుకోదు, కానీ బిజెపి అంటే తెలుగుదేశం పార్టీకి ఓకే కానీ కమ్యూనిస్టులతో కుదరదు, కాబట్టి అది మరో సమస్య.


ఈయన మాట వినేది ఎవరు? అంగీకరించేది ఎవరు? జగన్ మీద ఈయనకి ద్వేషం ఉంది  రాజకీయపరంగా మిగతా వాళ్ళకి ఆ ద్వేషం ఏమీ లేదు అంటే ఆ కమ్యూనిస్టు వాళ్ళది కూడా రాజకీయపరమైన పోరాటం మాత్రమే.  ఇక్కడ పవన్ కళ్యాణ్ కి జగన్ మీద ఉంది వ్యక్తిగతమైన ద్వేషం‌. అలాంటిది చంద్రబాబుకి కూడా లేదని వాళ్ళు రాజకీయంగానే చూసుకుంటూ ఉంటారని కొంతమంది అభిప్రాయం.


కాబట్టి  ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా ఉండడం అంటే అందర్నీ ఒక తాటిపైకి తీసుకురావడం అనే పాయింట్ పైన ఈయనకి నాయకత్వం ఎవరు ఇస్తారు? చంద్రబాబా? లేదంటే సిపిఎం రామకృష్ణ వీళ్ళతో కలిసి బిజెపితో మేము అందరం జగన్ ని గద్ది దించడానికి విధానాలను వదిలేసి కలిసిపోతామని చెప్తారా? కాబట్టి రాజకీయాలు జనాలకు తెలుసు, పార్టీలకు తెలుసు, పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు కానీ ఏదో ప్రయత్నిస్తూ అదే వ్యూహం అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం అంటున్నారు కొంత మంది.

మరింత సమాచారం తెలుసుకోండి: