ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా. చైనాలో బ్యాంకింగ్ రంగంలో అదే పరిస్థితి. లక్షల కోట్ల రూపాయలు కర్పూరంలా కరిగిపోయినటువంటి పరిస్థితి అక్కడ. చివరికి రియల్ ఎస్టేట్ దిగజారి పోయింది. పరిశ్రమలు కూడా అల్లల్లాడిపోతున్నాయి. కస్టమర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగం అక్కడ సమస్యలను ఎదుర్కొంటుంది. దీనిపైన దర్యాప్తుకి ఆదేశించాడు జింపింగ్. అప్పుడు అసలు విషయం బయటపడింది.


అది ఏంటంటే కమ్యూనిస్టు నాయకులను అక్కడ వాటికి నాయకత్వం పెట్టడం వల్ల, ఆయా బ్యాంకుల్లో దూరినటువంటి వాళ్ళు ఎలాంటి షూరిటీ లేకుండా ఎలాంటి పెట్టుబడులు పెట్టనటువంటి వాళ్లకు కూడా అప్పులు ఇప్పిచ్చారు. నిజమైన కంపెనీ వాళ్లకు అప్పులు రాలేదు. లేని కంపెనీలకు అప్పులు వచ్చాయి. ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు విలాసవంతంగా బ్రతికేస్తున్నారు. ఆ డబ్బులు తీసుకున్న వాళ్లలో ఈ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు.


ఇప్పుడు జింపింగ్ మూడోసారి ఎన్నికయ్యారు అక్కడ. ఇంతకుముందు రెండుసార్లు ఎన్నికైన సందర్భంగా కూడా జింపింగుకు ఈ విషయం తెలుసు. కానీ వాళ్ళు ఓటింగ్‌ లో  ధనవంతులైన సొంత పార్టీ దారులే కీలకమైన పాత్ర. దాంతో ఇప్పటిదాకా రెండుసార్లు ఆగి, ఇప్పుడు మూడోసారి గెలిచాక దాని తరఫున ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ తేల్చినటువంటి కీలకమైన పాత్రధారులను ఇప్పుడు అరెస్టు చేసేటువంటి పరిస్థితి.


మొత్తం లిచ్చియా పెంగ్ ఎవర్ బ్రైట్ గ్రూప్ చైర్మన్, లియా లియాన్ చైనా బ్యాంక్ మాజీ చైర్మన్, వాంగ్ చిన్ మాజీ చైనా ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్, వీళ్ళని డిసిప్లినరీ వైలెన్స్ కింద చైనాకు సంబంధించిన స్పెషల్ సెక్యూరిటీ వింగ్ 6రోజుల క్రితం  తీసుకుపోయారు. 62 ఏళ్ల లిచ్చియా పెంగ్ వచ్చేసరికి నేషనల్ సూపర్ విజన్ కమిషన్, సెంట్రల్ కమిషన్ ఫర్ డిస్ప్లేన్ వాళ్లు ఇద్దరూ కూడా ఈయన్ని ప్రశ్నించారు. ఈయన వందల కోట్ల రూపాయలను లంచం తీసుకుని, వేల కోట్ల రూపాయలు అప్పులు ఇప్పించారనే విషయం తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: