ఖలిస్థాన్ తీవ్రవాదులు ఇండియా నుంచి ప్రపంచ దేశాల్లో విస్తరించి పోయారు. ముఖ్యంగా వీరు ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా బ్రిటన్ లాంటి పెద్ద దేశాల్లో ఉంటూ అక్కడి నుంచి ఇండియాలో పంజాబ్ ఉన్న ప్రాంతాలను విడదీసేందుకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆయా దేశాల్లో ఉన్న చట్టాల ప్రకారం ప్రజా పరిరక్షణ పేరుతో వీరిని ఏం చేయకుండా వదిలేయడంతో అక్కడ ఉండి ఇండియాలో అలజడులు సృష్టించడానికి వ్యుహాలు రచిస్తున్నారు. ఒక్కోసారి ఇండియాకు వచ్చి విధ్వంసం చేసి తిరిగి ఆయా దేశాలకు వెళ్లిపోతున్నారు. మొదట్లో ఇక్కడ అలజడులు సృష్టించి అక్కడ మాఫియా డాన్ లుగా ఎదుగుతున్నట్లు తెలుస్తోంది.


దీంతో అమెరికా ఇలాంటి వ్యక్తులను 45 మందిని ఈ మధ్యే అరెస్టు చేసింది. బ్రిటన్ దేశానికి ఎన్ఐఏ ఒక రిపోర్టు పంపింది. ఖలిస్తాన్ తీవ్రవాదులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇండియాలో ఎప్పుడు ఎక్కడ అలజడులు సృష్టించారు. ఏయే ప్రాంతాల్లో వీరిపై కేసులు ఉన్నాయి. వీరికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. వీరి చేస్తున్న పనులు ఇలా ప్రతి విషయాన్ని ఎన్ఐఏ బ్రిటన్ ప్రభుత్వానికి అందజేసింది. ఎన్ఐఏ దర్యాప్తును అంగీకరించిన బ్రిటన్ అక్కడకి ఎన్ఐఏ అధికారులను రావడానికి అంగీకరించింది.


ముఖ్యంగా అమృత్ పాల్ చేసిన అలజడి వల్ల బ్రిటన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో పైన ఉన్న జాతీయ జెండాను దించివేసి ఖలిస్తాన్ ఉగ్రవాదులు తమ జెండాను ఎగురవేసుకున్నారు. దీంతో ఇండియా ఈ విషయంపై చాలా సీరియస్ అయినా విషయం తెలిసిందే. అమృత్ పాల్ గురించే ఇలాంటి దారుణానికి సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఒడిగట్టిందని ఎన్ఐఏ అధికారులు పూర్తి వివరాలను బ్రిటన్ పోలీసులకు తెలియజేశారు. ప్రస్తుతం బ్రిటన్ కు వెళ్లిన ఎన్ఐఏ అధికారులు, బ్రిటన్ పోలీసులతో కలిసి ఎలాంటి దర్యాప్తు చేపట్టనుంది. ఏ విధంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులను పట్టుకోనుంది. నిందితులను పట్టుకోవడంలో ఇరు దేశాలు ఎలా సహకరించుకుంటాయనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nia