అమెరికా మిత్రత్వ దేశం, జి-7లో ఒక పార్ట్, ఇంకా ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశం అయినటువంటి ఫ్రాన్స్, అధ్యక్షుడు మేకరాన్ పై దేశంలో తనకి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. 62ఏళ్ళకి కావాల్సిన పదవి విరమణ 64ఏళ్ళకి పెంచి, 62 ఏళ్లకు రావలసిన వృద్ధాప్య పెన్షన్ 64 ఏళ్ళకి మార్చినటువంటి విషయంలో, ప్రపంచంలో ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయనకు వ్యతిరేకంగా నిలదీస్తున్నారు ఫ్రాన్స్ దేశస్థులు. అక్కడ ప్రజలు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉద్యమాలు చేస్తున్నారు.


పారిస్ లాంటి అందమైన నగరం కూడా మురికి దిబ్బగా మారుతున్న వేళ, అక్కడ ఉద్యోగులందరూ చెత్త రోడ్ పైన  ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఆయన చైనాకు వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చారు, దారిలో ఉపన్యాసాలు ఇచ్చారు, అలాగే ఇతర దేశాలకు వెళ్లి ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇదే సందర్భంలో అమెరికాకి ఈ ఉపన్యాసాలలోనే హెచ్చరికలు జారీ చేశాడు ఆయన.


యూరప్ అనేది స్వతంత్ర వ్యవస్థలో ఉండాలి గాని అమెరికాకి తొత్తుగా ఉండకూడదని చెప్పిన ఆయన ఫ్రాన్సే కాదు యూరప్ అంతా కూడా స్వేచ్ఛగా పనిచేయాలని కొత్త స్టేట్మెంట్ తీసుకొచ్చాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మైక్రామ్ అమెరికాపై దాడికి దిగారు. ఇటీవలి కాలంలో అతని రెండవ పెద్ద దాడిలో ఐరోపా రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ యొక్క బానిసలు కావని, అంతేకాకుండా వారి స్వంత ప్రయోజనాల గురించి ఆలోచించే హక్కు వారికి ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు.


ఇటీవల అమెరికా ఇంకా చైనాల మధ్య ఐర్లాండ్ అధ్యక్షుడితో హౌస్ స్పీకర్లు సమావేశం కావడంపై   తైవాన్‌పై యూరోపియన్ యూనియన్ తీవ్ర స్థాయి వైఖరి నేపథ్యంలో మాక్రాన్ వ్యాఖ్యానించారు. అమెరికా చేతిలోని యుద్ధనౌకలు మేము కాదని వ్యాఖ్యలు చేయడంలోనే అర్థం ఏమిటంటే అమెరికా తొత్తులం మేము కాదని చెప్పడం అని తెలుస్తుంది. ఆయన ఎలా చెప్పినా సరే ఆయనని నమ్మే వాళ్ళు ఎవరు లేకపోవడం ఇక్కడ పాయింట్.

మరింత సమాచారం తెలుసుకోండి: