రష్యాను యుద్దంలో ఓడించాలంటే యూరప్ దేశాలు, ముఖ్యంగా నాటో పంపే ఆయుధాలతో గెలవచ్చని ఉక్రెయిన్ భావించింది. ఇందుకనుగుణంగా ప్రణాళికలు వేసుకుంది. నాటో నుంచి మిస్సైల్స్, యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు, గన్స్, ఇతర మందు గుండు సామగ్రి కూడా వచ్చింది. దీని ద్వారా ఈజీగా యుద్ధంలో గెలుస్తామని జెలెన్ స్కీ అనుకున్నారు.  


రష్యా దెబ్బకు నాటో దేశాల ఆయుధాలు తునతునకలైతుంటే నాటో దేశాల కంటే రష్యా వద్ద ఉన్న ఆయుధాల బలం ఎంటో ఇప్పుడు ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. నాటో పెద్ద సూపర్ పవర్ ఏం కాదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లోని లూహన్ స్కీ ప్రాంతంలో రష్యా చేస్తున్న దాడుల వల్ల నాటో పంపిన ఆయుధాాలు ధ్వంసమైపోతున్నట్లు ఉక్రెయిన్ చెబుతోంది.


రష్యా ఆయుధాల ముందు అవి ఏ మాత్రం నిలదొక్కుకుని ఎదురు దాడి చేసేంత శక్తివంతమైనవి కానట్లు తెలుస్తోంది. రష్యా చేస్తున్న దాడిలో నాటో దేశాలు పంపిన ఆయుధాలు ఏం పనిచేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కీవ్ లోని ఉక్రెయిన్ సైనికాధికారులే చెబుతున్నారు. సోవియట్ యూనియన్ లో ఉన్న సమయంలో మా దేశంలో తయారు చేయబడిన యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు వాటి కంటే బెటర్ గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.


నాటో దేశాలు పంపిస్తున్న ఆయుధాలు అంత బలహీనమైనవా? లేక ఎప్పుడో తయారు చేసి వాడకుండా పక్కకు పెట్టిన అన్నింటిని ఉక్రెయిన్ కు పంపిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క రష్యా దేశాన్ని కొట్టేందుకు అమెరికా, యూరప్ దేశాలు, ఉక్రెయిన్ అన్ని కలిసి దాడి చేస్తున్నా చివరకు చతికిల బడిపోతున్నారు. ఆయా దేశాలు అందిస్తున్న ఆయుధాలు నాసిరకమైనవి కావడంతో ఏమీ చేయలేని దీన పరిస్థితిలో ఉక్రెయిన్ ఉంది.  యుద్దంలో గెలవడం కాదు కదా.. చివరి వరకు పోరాడటం కష్టమేనని మేధావులు విశ్లేషిస్తున్నారు. అనేక సమస్యల మధ్య యుద్ధంలో గెలవాలంటే మామూలు విషయం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: