అగ్రరాజ్యాలైన అమెరికా, యూరప్ దేశాలు గతంలో భారత్ కి అంత విలువని ఇచ్చేవి కావు. కానీ ఇప్పుడవి కూడా భారత్‌ కు ప్రాముఖ్యత ఇస్తున్నాయని తెలుస్తుంది. భారత్ రష్యాతో ఉంటుందన్న కారణంతో ఆ దేశాలన్నీ కలిసి పాకిస్తాన్ ని ప్రోత్సహించేవి. కానీ ఇప్పుడు భారత్ అటు రష్యాతో ఉంటూనే, ఇటు అమెరికాతో కూడా స్నేహభావాన్ని కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది.


పాకిస్తాన్ లో ముందు  ఒక రాజకీయ నాయకుడిని పెట్టి వెనకాల సైనిక ప్రభుత్వం నడిపినటువంటి నవాజ్ షరీఫ్ అయినా, బెనజీర్ భుట్టో అయినా, ముషారఫ్ అయినా వీళ్ళందరికీ మద్దతు ఇస్తూ ఉండేవి అగ్ర రాజ్యాలు. ఇప్పుడు పాకిస్తాన్ చైనా తో స్నేహభావం కొనసాగిస్తుంది. అలాగే అదే సమయంలో భారత్ ఇటు రష్యాతోను, అటు అమెరికాతోనూ కూడా సమాంతరంగా కలిసి ఉంటుంది. అలాగే ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడడంతో భారత్ కి విలువ పెరిగిందని తెలుస్తుంది.


గతంలో భారత్ పేరు చెప్తే విదేశాల్లో ఉండే మన భారతీయులకు సెక్యూరిటీ ఉండేది కాదట. కానీ ఇప్పుడు భారత్ పేరు చెప్తే వాళ్ళకి ముందు మన యోగ ప్రక్రియలు అవి గుర్తుకొస్తున్నాయట. ఇప్పుడు భారత్ అంటే అక్కడ ఒక క్రేజ్ ఏర్పడుతుందని తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా జపాన్లో జరుగబోయే జి7 అగ్రరాజ్యాల సమావేశానికి భారత్ ను గెస్ట్ గా పిలిచారు. ఏడు అగ్రరాజ్యాలతో ఉన్న జి7లోకి ఎనిమిదవ అగ్ర రాజ్యాన్ని కూడా కలుపుకుని జి8గా రూపొందించారు.


మరో ప్రతిపాదనకు ఇండియా ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఎందుకంటే అగ్రరాజ్యాలు కలిపి రేపు కోట్లాడుకొని వాటిలో భారత్ ను కూడా కలుపుతారని, వాళ్ల తతంగంలో భారత్ ను కలిసి రమ్మంటారని భారత్ అభిప్రాయంలా తెలుస్తుంది. అందుకే భారత్ ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి భారత్ జి20 సదస్సుకి మాత్రమే అధ్యక్షత వహిస్తుంది. అలాగే జపాన్ లో మోడీకి జీ7 దేశాల తరఫున ఘన స్వాగతం పలికారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: