గ్రూప్‌-2 స్ర్కీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కటాఫ్‌ 74.49 మార్కులుగా తేలింది. మెయిన్స్‌కు ఎంపికైన మొత్తం 49,100 మంది అభ్యర్థుల వివరాలను తన www.psc.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచింది. మొత్తం 150 మార్కులకు స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించగా తప్పుల కారణంగా 3 మార్కులను తగ్గించారు. అంటే 147 మార్కులకుగాను 73 మార్కులు వచ్చిన వారికి అర్హత లభించింది. అయితే 147 మార్కులను 150 మార్కులకు స్కేలింగ్‌ చేసి చివరికి 74.49ను కటాఫ్‌ మార్కుగా తేల్చారు.



కానీ 74.49 కటాఫ్‌ మార్కుల్లో అభ్యర్థుల సంఖ్య దాదాపు 2 వేల వరకూ ఉండడంతో వారి పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్నవారికి అర్హత కల్పించారు. ఈ పరీక్షలో అనర్హత పొందిన అభ్యర్థుల జాబితాలను కూడా విడుదల చేశారు. స్ర్కీనింగ్‌ టెస్టులో అత్యధిక మార్కులు 129.59. క్వాలిఫైయింగ్‌ రేంజిలో ఉన్నప్పటికీ ట్యాంపరింగ్‌ కారణంగా 104 మందిని రిజెక్టు చేశారు. రిజిస్టర్‌ నెంబర్‌ను, సెట్‌ను బబ్లింగ్‌ చేయకపోవడం, మల్టిపుల్‌ బబ్లింగ్‌ చేయడం, ఇష్టానుసారంగా బబ్లింగ్‌ చేయడం వంటి కారణాలతో 12,573 మందిని డిస్‌క్వాలిఫై చేశారు. మెయిన్‌ పరీక్షను మే 20-21 తేదీల్లో నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: