ప్రస్తుతం మనం తీసుకునే ఆహార పదార్ధాల్లో చాలా వరకు కలుషితమైనవే ఉంటున్నాయి. ముఖ్యంగా జంగ్ ఫుడ్ తీసుకునే వారైతే పూర్తిగా డేంజర్ లో పడ్డేట్లే లెక్క. ఈ ప్రపంచంలో అన్నింటి కంటే ఆరోగ్యకరమైనవి వెజిటబుల్స్, ఫ్రూట్స్. అయితే ఈ మద్య కాలంలో వీటిని కూడా కలుషితం చేస్తూ కెమికల్స్ వేస్తూ హాని కలిగేలా చేస్తున్నారు. అన్ హెల్తీ ఫుడ్ తినడానికే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.పిల్లలు, పెద్దలు ఆవురావురు మంటూ లాగించేస్తారు. జంక్ ఫుడ్ ని ఇష్టపడినంత వేరే ఏ ఆహారాలను ఇష్టపడరు. శాతం కంటే ఎక్కువ మంది ఈ జంక్ ఫుడ్ కారణంగానే చనిపోతున్నారని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

మనం తినకూడని కొన్ని ఆహార పదార్థాలు :


చీజ్ బర్గర్స్ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతాయి. వీటిల్లో ఎక్కువగా శాచురేటెడ్ ఫ్యాట్, సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అస్సలు ఆరోగ్యకరం కాదు. కాబట్టి ఎక్కువ మోతాదులో వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగి గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి.


కేక్స్, బిస్కెట్స్, స్నాక్స్ లో ఎక్కువ‌గా రిఫైన్డ్ ఫ్లోర్ వాడ‌తారు. ఇలాంటి ఆహారాల వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి, మెట‌బాల‌జంపై దుష్ర్ప‌భావం చూపుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వెంట‌నే ఆక‌లిగా అనిపిస్తుంది. 


సోడా, షుగరీ డ్రింక్స్ అంటే ఇష్టపడని వాళ్లు బహుశా ప్రస్తుత జనరేషన్ లో ఉండరేమో. చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ డ్రింక్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వీటిల్లో న్యూట్రీషనల్ వ్యాల్యూస్ ఏమాత్రం ఉండవు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పు ఉంటుంది. 


ఐస్ క్రీముల్లో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ లెవెల్స్ ఉంటాయి. శాచురేటెడ్ ఫ్యాట్, షుగ‌ర్, క్యాల‌రీలు ఉంటాయి. హై శ్యాచురేటెడ్ ఫ్యాట్ వ‌ల్ల గుండె సంబంధిత వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతాయి. 


గొడ్డుమాంసం, పందిమాంసం, పౌల్ట్రీ మాంసాలలో హానికలిగించే రసాయనాలు, పెస్టిసైడ్స్, యాంటీ-బయాటిక్స్, హార్మోన్స్ మరియు వివిధ మందులు కలుపుతున్నారు. ఇందులో ఉండే పెస్టిసైడ్స్ మరియు ఫాట్'లు అనగా జంతువుల శరీరంలో ఉండే కొవ్వు కణాలు ఈ హానికర పదార్థాలను గ్రహించుకుంటాయి.  


సాల్మొనెల్లా బాక్టీరియా ఎక్కువగా ఉండేది గుడ్లలోనే వీటి వలన ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కావున వీటిని శీతల ప్రాంతాలలో ఉంచటం చాలా మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: