
ఇక పీనట్ బటర్ లో పి -కొమరిక్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెకు సంబంధించిన వ్యాధులను నయం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.ఇక అంతే కాకుండా ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడే అసంతృప్త కొవ్వును కూడా కలిగి ఉంటుంది.పీనట్ బటర్ ని తినడం వల్ల కార్డియోవాస్కులర్ ఇంకా కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం బారిన పడే ఛాన్స్ అనేది ఉండదు.అలాగే వేరుశెనగ వెన్నను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఈజీగా నియంత్రించవచ్చు. అంతేగాక ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం తెలిసిందేంటంటే..పీనట్ బటర్ ని క్రమం తప్పకుండా తినడం వల్ల మధుమేహం ఇంకా ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం వెంటనే తగ్గిపోతుంది.పీనట్ బటర్ లో ఐరన్ ఇంకా కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన బలమైన ఇంకా దృఢమైన ఎముకలకు ఎంతగానో ఉపయోగపడతాయి.