ఇక ఈ రోజుల్లో అరవై ఏళ్లకు రావాల్సిన షుగర్ వ్యాధి నేటి కాలంలో ఇరవై, ముప్పై ఏళ్లకే వస్తుంది. అధిక బరువు ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి ఇంకా అలాగే కొన్ని సందర్భాల్లో వారసత్వ పరంగా కూడా డయాబెటీస్ అనేది వస్తుంది. ఇక స్వీట్లని ఇష్టపడే వారు మధుమేహ బాధితులలో చాలామంది ఉంటారు. అలాంటి వారు సహజసిద్దమైన ఆహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. సాధారణంగా డయబెటీస్ పేషెంట్లు పండ్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటారు. కానీ పూర్తిగా పండ్లికి మాత్రం దూరమైతే వాటి నుంచే వచ్చే పోషకాలు కూడా దూరమవుతాయి. ఇక అందుకోసం పండ్లని తినాలి. కానీ ఎంతమేరకు తినాలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం.సీతాఫలంలో చక్కెర స్థాయిలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే షుగర్ పేషెంట్లు ఈ పండుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే దానిమ్మ కాయ కూడా మధమేహ రోగులకు మంచి ఆహారం. అలా అని దాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకు ఒక కాయ తింటే చాలు రక్తంలో చక్కెరను ఈజీగా నియంత్రిస్తుంది.అలాగే అరటిపండు బరువు తగ్గడం ఇంకా అలాగే ప్రేగు సంబంధిత రుగ్మతలు, మలబద్ధకం ఉపశమనం ఇంకా అలాగే రక్తహీనతలని కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది. 


అలాగే ఈ పండులో చక్కెర స్థాయిలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు అరటిపండును పూర్తిగా తినడకుండా సగం ముక్కని తీసుకుంటే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..యాపిల్ పండు విషయానికి వస్తే..మిగిలిన పండ్లన్నింటిలో కంటే కూడా ఈ యాపిల్‌ పండ్లలో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. యాపిల్ పండు కొలెస్ట్రాల్ నిలువలు తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా శుభ్రం చేస్తుంది. అయితే డయాబెటీస్‌ రోగులు రోజుకు ఒక యాపిల్ తింటే వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. అంతకు మించి ఎక్కువ తింటే మాత్రం అనేక సమస్యలు అనేవి ఎదురవుతాయి.ఇక అలాగే బొప్పాయి పండు గుండె జబ్బుల నుంచి పూర్తిగా రక్షిస్తుంది. అలాగే షుగర్‌ని కూడా చాలా ఈజీగా అదుపులో ఉంచుతుంది. ఇంకా కాన్సర్ వ్యాధి కూడా రాకుండా నిరోధిస్తుంది. అయితే బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో అతిగా తీసుకుంటే అంతే చెడ్డది కూడా. కాబట్టి షుగర్ పేషెంట్లు బొప్పాయి పండుని మాత్రం మితంగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: